తెలంగాణ, ఏపీ రిసోర్స్ పర్సన్స్​కు ట్రైనింగ్ షురూ

తెలంగాణ, ఏపీ రిసోర్స్ పర్సన్స్​కు ట్రైనింగ్ షురూ

హైదరాబాద్, వెలుగు: పీఎం శ్రీ( ప్రధాన మంత్రి స్కూల్ ఫర్ రైజింగ్ ఇండియా) స్కీమ్ అమలులో భాగంగా ఏపీ, తెలంగాణకు చెందిన రీసోర్స్ పర్సన్స్​కు హైదరాబాద్ లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ట్రైనింగ్ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాన్ని సోమవారం సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్  డైరెక్టర్ మల్లయ్య భట్టు ప్రారంభించారు. పీఎం శ్రీ తొలిదశ కింద తెలంగాణలో 2023~-24లో 543 స్కూళ్లు, 2024–25లో 251 స్కూళ్లు ఎంపిక అయ్యాయని చెప్పారు. స్టూడెంట్లలో అభ్యాసన సామర్థ్యాలను పెంచేందుకు, గ్లోబల్ సిటిజన్స్ గా తీర్చిదిద్దేందుకు ఈ స్కూళ్లు ఉపయోగపడతాయని తెలిపారు. 

ఏపీలోనూ రెండేండ్లలో  875 స్కూళ్లు పీఎంశ్రీ కింద ఎంపికయ్యాయని వెల్లడించారు. స్టేట్ రీసోర్స్ పర్సన్స్ కు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఎన్సీఈఆర్టీ నుంచి నేషనల్ రీసోర్స్ పర్సన్స్ వచ్చారని చెప్పారు. ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న ఆర్పీలు.. ఆయా రాష్ర్టాల్లోని హెడ్మాస్టర్లకు ట్రైనింగ్ ఇవ్వనున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏపీ సిమాట్ డైరెక్టర్ మస్తానయ్య, సమగ్ర శిక్ష ఏఎస్​పీడీ జి.రమేశ్, జాయింట్ డైరెక్టర్లు పి.రాజీవ్, వెంకటనర్సమ్మ, అధికారులు తాజ్ బాబు, ప్రసాద్ రావు, సంపత్ రావు తదితరులు పాల్గొన్నారు.