100 మంది కుమ్మరులకు బీసీ కార్పొరేషన్ శిక్షణ
హైదరాబాద్, వెలుగు: ఈ సారి గణపతి పండుగకు 7మీటర్ల ఎత్తు వరకు మట్టి వినాయకులను తయారు చేయనున్నారు. ఇందుకోసం కుమ్మరులకు బీసీ కార్పొరేషన్ ట్రైనింగ్ ఇస్తోంది. పోయినేడాది 400 మందికి చిన్న గణపతుల తయారీలో ట్రైనింగ్ ఇవ్వడంతో 20 వేల గణేశులను తయారు చేశారు. దీంతో కుమ్మరులకు ఉపాధి లభించినట్లైంది. ఈసారి మరో 100 మందికి పెద్ద వినాయకుల తయారీలో శిక్షణ ఇస్తున్నారు. ఒక్కో గణపతి రూ.5 వేల నుంచి 10వేల వరకు ఉంటుందని బీసీ కార్పొరేషన్ ఎండీ అలోక్ కుమార్ తెలిపారు.