ఎన్నికల నిర్వహణకు రెడీగా ఉండాలి : సీహెచ్‌‌.శివలింగయ్య

జనగామ అర్బన్, వెలుగు : ఎన్నికల నిర్వహణకు ఆఫీసర్లు సిద్ధంగా ఉండాలని జనగామ కలెక్టర్‌‌ సీహెచ్‌‌.శివలింగయ్య ఆదేశించారు. అడిషనల్‌‌ కలెక్టర్లు రోహిత్‌‌సింగ్‌‌, సుహాసినితో కలిసి శుక్రవారం కలెక్టరేట్‌‌ కాన్ఫరెన్స్‌‌ హాల్‌‌లో ఎన్నికల సిబ్బందికి ట్రైనింగ్‌‌ ఇచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్‌‌ మాట్లాడుతూ ఎలక్షన్‌‌ కమిషన్‌‌ సూచన మేరకు ఎలక్షన్‌‌ డ్యూటీ కోసం శాఖల వారీగా కమిటీలు, ప్రత్యేక నోడల్‌‌ ఆఫీసర్లను నియమించినట్లు చెప్పారు. సెక్టోరియల్‌‌ ఆఫీసర్లు ప్రతి పోలింగ్‌‌ సెంటర్‌‌ను తనిఖీ చేసి వసతులు ఉన్నాయో, లేవో తనిఖీ చేయాలని ఆదేశించారు.

కలెక్టరేట్‌‌లో ప్రత్యేక కంట్రోల్‌‌ రూమ్‌‌, మీడియా రూమ్‌‌ రెడీ చేయాలని, చెక్‌‌ పోస్టులను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎన్నికల కోడ్, షెడ్యూల్‌‌ వచ్చిన తర్వాత సిబ్బంది డ్యూటీలో చేరాలని చెప్పారు. అన్ని అంశాలపై రూట్‌‌ మ్యాప్‌‌ వేసుకొని సిద్ధంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జనగామ, స్టేషన్‌‌ ఘన్‌‌పూర్‌‌, పాలకుర్తి రిటర్నింగ్‌‌ ఆఫీసర్లు మురళీకృష్ణ, రామ్మూర్తి, సహాయ రిటర్నింగ్‌‌ ఆఫీసర్లు, సెక్టోరియల్‌‌ ఆఫీసర్లు, మాస్టర్‌‌ ట్రైనర్స్‌‌ పాల్గొన్నారు.