హైడ్రాలోని DRF సిబ్బందికి హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యని తగ్గించడానికి రంగంలోకి దిగనుంది. ఈ మేరకు డిజాస్టర్స్ రెస్పాన్స్ ఫోర్స్ ఉద్యోగులకు ట్రాఫిక్ క్లియర్ చేయడంపై అవగహన క్లాస్ ను చెప్పారు ట్రాఫిక్ అధికారులు. గోషామహల్ లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మొదటి విడతగా 50 మంది హైడ్రా సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. వారు ట్రాఫిక్ క్రమబద్దీకరణ మెలుకువలు నేర్చుకుంటున్నారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్‌లు పేరిట ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలు అందించనున్నారు.
భారీ వర్షాలు, వరదలు, ప్రకృతి విపత్తులు వచ్చిన సయమంలో DRF సిబ్బంది విధులు నిర్వహించే వారు.. ప్రస్తుతం హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్య పెరుగుతుండటంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వాటిని పరిష్కరించేందుకు హైడ్రా సహాయం చేస్తోందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ నిర్ణయం తీసుకున్నారు. ట్రాఫిక్ రద్దీ, ఇతర ముఖ్యమైన సమయాల్లో పోలీసులకు సహకరించే విధంగా హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ల సేవలుంటాయన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతంలో తెలిపారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ పేరిట రేడియం జాకెట్లు వేసుకుని సేవలకు అందించుకునేందుకు సిద్ధమౌతున్నారు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది.