ఫుడ్​సేఫ్టీపై శిక్షణ

ఫుడ్​సేఫ్టీపై శిక్షణ

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు :  నేషనల్‌‌‌‌‌‌‌‌ రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎఐ) హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ చాప్టర్‌‌‌‌‌‌‌‌, జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ ఆహారభధ్రతా విభాగం, ఎఫ్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ఎఎఐకి చెందిన ఫోస్టాక్‌‌‌‌‌‌‌‌ తో కలిసి ఫుడ్​సేఫ్టీపై శిక్షణ ఇచ్చాయి.  రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌ నిర్వాహకులకు బేగంపేటలోని ఐహెచ్‌‌‌‌‌‌‌‌ఎం శ్రీ శక్తిలో  అవగాహన–శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. శిక్షణకు నగరానికి చెందిన 40కి పైగా బ్రాండ్ల సిబ్బంది హాజరయ్యారు.  

ఈ సందర్భంగా ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఎఐ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ చాప్టర్‌‌‌‌‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌‌‌‌‌  సంపత్‌‌‌‌‌‌‌‌ తుమ్మల  మీడియాతో మాట్లాడుతూ ఉచితంగానే ఈ శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. ఎన్‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌ఏఐ హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ చాప్టర్‌‌‌‌‌‌‌‌కు చెందిన  రెస్టారెంట్‌‌‌‌‌‌‌‌ యజమానులు  తమ సిబ్బందికి ఈ శిక్షణ ఇప్పించడం తప్పనిసరి అన్నారు.