మే 1 నుంచి పోలింగ్​ డ్యూటీపై శిక్షణ

భూపాలపల్లి అర్బన్, వెలుగు: లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ విధులపై మే 1, 2 ,3 తేదీల్లో ట్రైనింగ్ క్లాసులు నిర్వహించనునట్లు జిల్లా ఎన్నికల అధికారి భవేశ్ మిశ్రా తెలిపారు. రెండో విడత ర్యాండమైజేషన్​ప్రక్రియ నిర్వహణ తదుపరి పీవో, ఏపీవోలకు విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మే 1, 2న 397 మంది పీఓలు, 425 మంది ఏపీఓలకు, 3న 789 మంది ఓపీవోలకు శిక్షణ ఉంటుందన్నారు.

ఉదయం 9 గంటలకు భూపాలపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మాంటిసోరి ఉన్నత పాఠశాలలో  రిపోర్టు చేయాలన్నారు. శిక్షకు అన్ని ఏర్పాట్లు చేయాలని స్టాఫ్ మేనేజ్​మెంట్ ఆఫీసర్లను ఆయన ఆదేశించారు. అంతకుముందు కలెక్టరేట్​లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్​భవేశ్​మిశ్రా 18 దరఖాస్తులను స్వీకరించారు.