హైదరాబాద్, వెలుగు: క్విక్- సర్వీస్ రెస్టారెంట్ కేఎఫ్సీ అంతర్జాతీయ సైన్ లాంగ్వేజ్ డేను పురస్కరించుకొని తన అన్ని ఉద్యోగులకు సైన్ లాంగ్వేజ్ (సంకేత భాష) శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. తమ కార్పొరేట్ఆఫీసులో పనిచేసే వాళ్లు సహా అందరు ఉద్యోగులూ ఇందులో పాల్గొంటున్నారని సంస్థ సీనియర్ ఎగ్జిక్యూటివ్ఒకరు చెప్పారు. ఈ శిక్షణ కార్యక్రమం చెవిటి ఉద్యోగ అవకాశాలను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. వినికిడి సమస్యలు ఉన్న వ్యక్తులకు మరిన్ని ఉద్యోగాలు ఇస్తామని వివరించారు.