తెల్ల చేపల పెంపకంపై ట్రైనింగ్‌‌

ఖిలా వరంగల్‌‌, వెలుగు : తెల్ల చేపల పెంపకంపై మామునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం ట్రైనింగ్‌‌ ప్రోగ్రామ్‌‌ నిర్వహించారు. పీవీ. నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, జాతీయ మత్స్య అభివృద్ధి మండలిలో ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఫిషరీస్‌‌ డిపార్ట్‌‌మెంట్‌‌ జిల్లా ఆఫీసర్‌‌ నరేశ్‌‌ కుమార్‌‌ నాయుడు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలను వినియోగించుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకున్న రైతులు, మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. కార్యక్రమంలో కేవీకే సైంటిస్ట్‌‌ రాజన్న, గణేశ్‌‌, రాజు, సాయికిరణ్‌‌ పాల్గొన్నారు.