మెదక్లో కూలిన విమానం..

మెదక్లో కూలిన విమానం..

మెదక్ లో ఓ శిక్షణ విమానం కూలిపోయింది. 2023 సోమవారం డిసెంబర్ 4న ఉదయం 8గంటల సమయంలో తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి రావెల్లి శివారులో దుండిగల్ ఎయిర్ ఫోర్స్ కు సంబంధించిన విమానం కూలింది. పెద్ద శబ్దంతో విమానం కూలిపోవడాన్ని స్థానికులు గుర్తించారు. విమానం కూలడంతో భారీ ఎత్తున్న మంటలు చెలరేగి.. పూర్తిగా కాలిపోయింది. దీంతో అందులో ఎంతమంది ఉన్నారన్న విషయం ఇంకా తెలియరాలేదు.

ప్రమాదంలో శిక్షణలో ఉన్న పైలట్లు తప్పించుకున్నారా లేదా అనేది తేలాల్సి ఉంది. పరిసర ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియల్సి ఉంది.