ఓటింగ్ యంత్రాలపై అవగాహన ఉండాలి: వల్లూరు క్రాంతి

ఓటింగ్ యంత్రాలపై అవగాహన ఉండాలి: వల్లూరు క్రాంతి

నారాయణపేట/గద్వాల, వెలుగు : అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల పాత్ర ముఖ్యమైందని, ఎలక్ట్రానిక్​ ఓటింగ్ యంత్రాలపై పూర్తి అవగాహన ఉండాలని నారాయణపేట, గద్వాల కలెక్టర్లు కోయ శ్రీహర్ష, వల్లూరు క్రాంతి సూచించారు. గురువారం కలెక్టరేట్ల లోని మీటింగ్​ హాల్​లో మాస్టర్ ట్రైనర్లతో సెక్టార్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్లు మాట్లాతూ సెక్టార్ అధికారి తమ పరిధిలోని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని, ఈవీఎం, వీవీ ప్యాట్లు, హ్యాండ్ బుక్, పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన ఉండాలని చెప్పారు.

బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణపై అన్ని విషయాలు తెలుసుకోవాలన్నారు. ఈవీఎంలలో సమస్య తలెత్తితే రిజర్వు ఈవీఎంలు అందుబాటులో ఉంచాలన్నారు.