ఒడిశాలో రైల్వే లైన్లకు మరమ్మతులు చేస్తున్న కారణంగా ఆ మార్గంలో పయనించే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. పునరుద్ధరణ పనుల కారణంగా జూన్ 27, 28 తేదీల్లో రైళ్లను రద్దు చేశారు. దక్షిణ మధ్య రైల్వే జూన్ 25 నుంచి జూలై 6 వరకు 36 MMTS రైళ్లను కూడా రద్దు చేసింది. జూన్ 27న సికింద్రాబాద్- షాలిమార్ (12774), జూన్ 28న షాలిమార్- సికింద్రాబాద్ (12773) మధ్య నడిచే రైళ్లు రద్దు అయ్యాయి.
రద్దయిన రైళ్ల వివరాలు
- జూన్ 26న బయలుదేరాల్సిన సంత్రాగచ్చి -తాంబరం అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ (22841),
- జూన్ 28వ తేదీన బయలుదేరాల్సి ఉన్న తాంబరం -సంత్రాగచ్చి అంత్యోదయ ఎక్స్‌ప్రెస్ (22842),
- జూన్ 28వ తేదీన బయలుదేరాల్సి ఉన్న బెంగుళూరు -సూపర్‌ఫాస్ట్ ఏసీ ఎక్స్‌ప్రెస్ (22864)
- జూన్ 27వ తేదీన బయలుదేరాల్సిన హౌరా - ఎస్‌ఎంవీటీ బెంగళూరు హం సఫర్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ (22887)
- జూన్ 27న బయలుదేరాల్సిన షాలిమార్ - చెన్నై సెంట్రల్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22825)
- జూన్ 27న బయలుదేరాల్సిన సంత్రాంగచ్చి - చెన్నై సెంట్రల్ బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఏసీ ఎక్స్‌ప్రెస్ (22807)
- జూన్ 27న బయలుదేరాల్సిన విల్లుపురం - ఖరగ్‌పూర్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22604)
- జూన్ 28న బయలుదేరాల్సిన చెన్నై సెంట్రల్ - షాలిమార్ వీక్లీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (22826)
- జూన్ 29న బయలుదేరాల్సిన చెన్నై సెంట్రల్ - సంత్రాంగచ్చి బైవీక్లీ సూపర్‌ఫాస్ట్ ఏసీ ఎక్స్‌ప్రెస్ (22808)
చెన్నై సెంట్రల్- కేఎస్ఆర్ బెంగళూరు-చెన్నై సెంట్రల్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ (12027/12028)కు జూలై 9వతేదీ నుంచి జోలార్‌పేటలో హాల్ట్ ఇస్తున్నట్లు దక్షిణ రైల్వే వెల్లడించింది.