AP Rain alert: ఏపీలో రెడ్ అలర్ట్ జారీ... 20 రైళ్లు రద్దు..

ఏపీలో పలు జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు గోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.భారీవర్షాల నేపథ్యంలో విజయవాడ డివిజన్ లో 20 రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.

  • 07279 – విజయవాడ టు తెనాలి – సెప్టెంబర్ 1
  • 07575- తెనాలి టు విజయవాడ – సెప్టెంబర్ 1
  • 07500 – విజయవాడ టు గూడూరు – ఆగస్టు 31
  • 07458 – గూడూరు టు విజయవాడ – సెప్టెంబర్ 1
  • 17257 – విజయవాడ టు కాకినాడ పోర్ట్ – ఆగస్టు 31
  • 07874 – తెనాలి టు రేపల్లె – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
  • 07875 – రేపల్లె టు తెనాలి – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
  • 07869 – మచిలీపట్నం టు గుడివాడ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
  • 07868 – గుడివాడ టు మచిలీపట్నం – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
  • 07885 – భీమవరం జంక్షన్ టు నిడదవోలు – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
  • 07886 – నిడదవోలు టు భీమవరం జంక్షన్ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
  • 07281 – నర్సాపూర్ టు గుంటూరు – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
  • 07785 – రేపల్లె టు గుంటూరు – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
  • 07976 – గుంటూరు టు విజయవాడ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
  • 17269 – విజయవాడ టు నర్సాపూర్ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
  • 07576 – ఒంగోలు టు విజయవాడ – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
  • 07898 – విజయవాడ టు మచిలీపట్నం – ఆగస్టు 31, సెప్టెంబర్ 1
  • 07899 – మచిలీపట్నం టు విజయవాడ – సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2
  • 07461 – విజయవాడ టు ఒంగోలు – సెప్టెంబర్ 1, సెప్టెంబర్ 2 

ఈ రైళ్లను  రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు సహకరించాలని కోరారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నేటి అర్థరాత్రికి ( ఆగస్టు 31)  విశాఖపట్నం – గోపాల్ పూర్ మధ్య కళింగపట్నానికి దగ్గరలో వాయుగుండం తీరం దాటుతుందని అధికారులు అంచనా వేశారు.  గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం తీరాన్ని సమీపించే కొద్దీ వర్షాల తీవ్రత పెరుగుతుందని, ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

హైదరాబాద్ – విజయవాడ నేషనల్ హైవేపై వరదనీరు నిలిచిపోయింది. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కాజా టోల్ ప్లాజా వద్ద, విజయవాడ గుంటూరు హైవే పై భారీగా వరదనీరు నిలిచిపోయింది. విజయవాడ బస్టాండ్ వద్ద మోకాలి లోతు వరదనీరు నిలిచిపోయింది. 

ALSO READ | వర్ష బీభత్సం : వరదలకు కొట్టుకుపోయిన కారు.. ముగ్గురు మృతి

ఇదిలా ఉండగా.. ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం 3.24 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. 3.2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కాల్వలలోకి 3వేల 507 క్యూసెక్కుల నీటిని వదిలారు.