సికింద్రాబాద్, హైదరాబాద్​ డివిజన్లలో పలు రైళ్ల రద్దు

సికింద్రాబాద్​, వెలుగు: సికింద్రాబాద్​,హైదరాబాద్​ డివిజన్లలో ట్రాక్​ మెయింటెనెన్స్​పనుల కారణంగా  సోమవారం నుంచి  ఈనెల 11వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేశారు. కాజీపేట, డోర్నకల్, విజయవాడ, భద్రాచలం రోడ్ , సిర్పూర్​ టౌన్, బల్లార్షా, సికింద్రాబాద్, వరంగల్,హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల మధ్య నడిచే రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.  ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని సూచించారు.

ఎంఎంటీఎస్ లు ​కూడా..

సిటీలోని వివిధ స్టేషన్ల మధ్య నడిచే 16 ఎంఎంఎటీఎస్​ రైలు సర్వీసులను కూడా రద్దు చేశారు. లింగంపల్లి– హైదరాబాద్, హైదరాబాద్–లింగంపల్లి మధ్య 4 సర్వీసులు,  లింగంపల్లి –ఫలక్​నుమా, ఫలక్​నుమా– లింగంపల్లి మధ్య 1 సర్వీసు, ఉందానగర్– లింగంపల్లి మధ్య, లింగంపల్లి– ఉందానగర్​ మధ్య 2 సర్వీసులు, లింగంపల్లి–హైదరాబాద్​-లింగంపల్లి మధ్య 2 సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ఈనెల 10 వరకు రద్దు కొనసాగుతుందని, ప్యాసింజర్లు ప్రత్యామ్నాయ రవాణా సౌకర్యాలు చూసుకోవాలని సూచించారు.