హనుమకొండ జిల్లాలో సాకేంతిక లోపంతో ఆగిన రైళ్లు

కమలాపూర్, వెలుగు : సాంకేతిక కారణాలతో ఒకే రైల్వేస్టేషన్లో రెండున్నర గంటల పాటు  రైళ్లు ఆగడంతో ప్రయాణికులు ఆందోళనకు దిగారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్ రైల్వే స్టేషన్​లో సాంకేతిక లోపాలతో సాయంత్రం సిర్పూర్ కాగజ్నగర్ నుంచి సికింద్రాబాద్ కు వెళ్లే ఇంటర్సిటీ ఎక్స్​ప్రెస్​అరగంట తర్వాత నవజీవన్ ఎక్స్​ప్రెస్ రైల్వే స్టేషన్ లో ఆగింది.

రెండున్నర గంటల పాటు ఆగిన ఈ రెండు ఎక్స్​ప్రెస్ రైలు రైల్వే స్టేషన్ నుంచి కదలకపోవడంతో ప్రయాణికులు ట్విట్టర్ ద్వారా రైల్వే అధికారులకు కంప్లైంట్ చేశారు. ఎలాంటి సౌకర్యాలు లేని రైల్వే స్టేషన్లో ప్రయాణికులను రెండున్నర గంటలపాటు ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైల్వే అధికారుల నిర్లక్ష్యంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రైల్వే అధికారులు ఒకదాని ఇంజిన్ మరొకదానికి ఏర్పాటు చేయడంతో రైల్వే స్టేషన్ నుంచి రెండు ఎక్స్​ప్రెస్​లు కదిలాయి.