స్పాం కాల్స్ కు చెక్ చెప్పేలా ట్రాయ్ కొత్త రూల్స్.. నవంబర్ 1 నుండి అమలు

స్పాం కాల్స్ కు చెక్ చెప్పేలా ట్రాయ్ కొత్త రూల్స్.. నవంబర్ 1 నుండి అమలు

స్పాం కాల్స్, మెసేజ్ లకు చెక్ చెప్పేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. శుక్రవారం ( నవంబర్ 1, 2024 ) నుండి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. యూజర్ల భద్రతను మరింత పటిష్టం చేసేందుకే ట్రాయ్ కొత్త రూల్స్ అమలు చేయనుందని తెలుస్తోంది. జియో, ఎయిర్టెల్, వీఐ, బీజీఎస్ఎన్ఎల్ సహా అన్ని ప్రముఖ టెలికాం కంపెనీలకు ఈ రూల్స్ వర్తిస్తాయి.

మెసేజ్ ట్రేసబిలిటీ: స్పాం ను అరికట్టే కొత్త టూల్: 

ట్రాయ్ తెచ్చిన కొత్త రూల్స్ లో ఇది ముఖ్యమైనది. నవంబర్ 1 నుండి, టెలికాం కంపెనీలు ఫేక్, స్పామ్ మెసేజ్ లపై ఫోకస్ పెట్టి ట్రాక్ చేయనున్నాయి.. ట్రేసబిలిటీ ప్రమాణాలకు అనుగుణంగా లేని మెసేజ్ లను బ్లాక్ చేస్తాయి. మెసేజ్ ట్రేస్‌బిలిటీ అనేది ట్రాంజాక్షనల్, ప్రమోషనల్ మెసేజ్ లను గుర్తించడం, స్పామ్, ఫ్రాడ్ మెసేజ్ లను గుర్తించి.. అవి యూజర్లకు చేరకుండా నియంత్రిస్తుంది.

టెలిమార్కెటింగ్ కంపెనీలకు కొత్త రూల్స్:

ట్రాయ్ బ్యాంకులు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఫైనాన్సియల్ ఇంస్టిట్యూషన్స్ నుండి వచ్చే అన్ని మెసేజ్ లను సులభంగా గుర్తించడానికి ప్రత్యేక పద్దతులను అనుసరించాలని ఆదేశించింది. కొత్త రూల్స్ ద్వారా యూజర్లు టెలిమార్కెటింగ్ మెసేజ్ లను స్పామ్, ప్రమోషనల్ కంటెంట్ ను ఈజీగా గుర్తించి ఆన్లైన్ మోసాలకు దూరంగా ఉండేలా తోడ్పడుతుంది.

హారిజాన్ పై నిఘా కట్టుదిట్టం:

కొత్త రూల్స్ విషయంలో ఆగస్టులోనే అన్ని టెలికాం కంపెనీలను అప్రమత్తం చేసింది ట్రాయ్. నవంబర్ 1ని డెడ్ లైన్ గా ఆగస్టులోనే ప్రకటించింది. స్పామ్ కాల్స్, మెసేజెస్ పై పర్యవేక్షణను మెరుగుపరచడం ద్వారా, యూజర్లకు పారదర్శకత, భద్రతను పెంచాలని నిర్ణయించింది ట్రాయ్. డిజిటల్ సెక్యూరిటీపై దేశంలో సుదీర్ఘకాలంగా ఉన్న ఆందోళనను నివారించేందుకు ట్రాయ్ కొత్త రూల్స్ తెచ్చినట్లు తెలుస్తోంది.