కామారెడ్డి జిల్లాలో విషాదం.. బిల్డింగ్ పై నుంచి దూకి మహిళ మృతి

కామారెడ్డి జిల్లాలో విషాదం.. బిల్డింగ్ పై నుంచి దూకి మహిళ మృతి

కామారెడ్డి జిల్లాలో మూడో అంతస్తు భవనం నుంచి పడి ఓ మహిళ మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని అశోక్ నగర్ కాలనీలో నిర్మాణంలో ఉన్న మూడో అంతస్తు భవనం పైనుంచి  పడి రాజేశ్వరి (50) అనే మహిళ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. 

 పోలీసులు మాట్లాడుతూ.. నిన్న రాత్రి రాజేశ్వరి, తన భర్త భూమయ్యకు మధ్య గొడవ జరిగిందని తెలిపారు. ఆ క్రమంలో మూడో అంతస్తు భవనం పైనుంచి పడి మృతి చెందినట్లు తెలిపారు. వీరి స్వస్థలం పల్వంచ మంతన్ దేవునిపల్లి గ్రామంగా గుర్తించామన్నారు. సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందా.. కుట్ర కోణం ఏమైనా ఉందా అనేది దర్యాప్తులో తేలుస్తామన్నారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని కామారెడ్డి పట్టణ పోలీసులు వెల్లడించారు.