తొలి అడుగు ఎప్పుడూ ఒంటరే. తర్వాత వచ్చేవారికి మార్గమవుతుంది. అక్కాయి జీవితమే దీనికి ఒక ఉదాహరణ. తనకు ఇక చావే గతి అనుకున్న స్థితి నుంచి జీవితమనే పోరాటానికి ఎదురీది విజయం సాధించింది. ట్రాన్స్ జెండర్లకు‘నేనున్నా..’నంటూ ధైర్యం చెబుతోంది. డాక్టరేట్ సాధించి నలుగురికీ ఆదర్శంగా నిలుస్తోంది. తమ సమస్యలను అంతర్జాతీయ స్థాయిలో ప్రస్తావించిం ది. తప్పనిసరి పరిస్థితుల్లో లింగ మార్పిడి చేసుకున్న తనలాంటి వాళ్లను సమాజం చిన్నచూపు చూడకుండా పెద్ద మనసుతో అక్కున చేర్చుకోవాలని పిలుపునిస్తోం ది.
అక్కాయిది బెం గళూరులో మధ్య తరగతి కుటుంబం. తండ్రి ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి . తల్లి హౌస్‌వైఫ్ . బాల్యం ఆమెకు ఒక రకంగా బందిఖానే అయింది. తికమకలకు గురి చేసిం ది. పుట్టుకతో అబ్బాయి కావటంతో పేరెంట్స్ జగదీశ్ అనే పేరు పెట్టా రు. కానీ అక్కాయికి నిక్కరు బదులు గౌను వేసుకోవాలని, ఆడపిల్లలతో కలిసి ఆడుకోవాలని ఉండేది.అమ్మానా న్న ఒప్పుకోకపోగా తీవ్రంగా కోప్పడేవారు. ఆమె ప్రవర్తన వాళ్లకు ఇబ్బందిగా అనిపించేది.‘అక్కాయి ఒక అబ్బా యి’ అని నమ్మించటానికి ప్రయత్నిం చేవారు. కానీ సాధ్యపడలేదు.
లోకల్ డాక్టర్లతో వైద్యం చేయిం చినా ఫలితం కనబడలేదు. అక్కాయికి 12 ఏళ్ల వయసు వచ్చేసరికి ఒంట్లోఅనూహ్యమై న మార్పులు చోటుచేసుకున్నాయి. అవి ఆమెను అనేక విధాలుగా కలవరపెట్టా యి. తన మనసు తన కంట్రోల్లో ఉండేది కాదు. దీంతో ఆందోళనకు గురవుతూ ఒంటరి జీవితం అనుభవించిం ది. ఒక దశలో ఆత్మహత్య చేసుకోవటానికీ ప్రయత్నించింది. కానీ ఏదో ఒక మూలన ఆశ ఉండి అడ్డుపడేది.
చావో.. రేవో..
తనకంటూ ఒక వ్యక్తిత్వాన్ని సొంతం చేసుకోవాలని, అమ్మాయిగా కొనసాగాలని నిర్ణయిం చుకుంది.అయితే ఆ ప్రయాణం అంత సులభం కాదని గుర్తించిం-ది. అయినా విశ్వాసంతో ముందడుగు వేసింది. క్లో జ్గా ఉండే తన సోదరుడి నుంచి దూరంగా జరగటం మొదలు పెట్టిం ది. సోదరుడు అర్థం చేసుకొని తల్లిదండ్రులను కూడా ఒప్పించటానికి ప్రయత్నించాడు. కానీవాళ్లు వినలేదు. అయినా అక్కాయి భయపడలేదు.అప్పటి నుంచి ట్రాన్స్జెండర్ల ప్రవర్తనను గమనించటం ప్రారంభించిం ది. ఒకానొక రోజు బెంగళూరులోని ఓ పార్కు సమీపంలో ఒక ట్రాన్స్‌జెండర్‌ను కలిసి తన మనసులోని బాధను బయటపెట్టింది. అయితే ఆమె తనలా మారొద్దని అక్కాయికి సలహా ఇచ్చింది. ఒక వేళ ట్రాన్స్‌జెండర్‌గా మారితే బతకటానికి బిచ్చమెత్తుకోవటం లేదా సెక్స్ వర్కర్‌గా పనిచేయటం తప్ప మరో దారిలేదని తేల్చి చెప్పింది. అక్కాయి మాత్రం ఆమె మాటలు పట్టించుకోలేదు. చివరికి వాళ్లలాగే మారాలని నిర్ణయించుకుం ది. బతుకు దెరువు కోసం నాలుగేళ్లు బెగ్గర్, సెక్స్ వర్కర్ అవతారమెత్తింది. ఇంట్లో నేమో ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నట్లు చెప్పింది.
‘సంగమ’ సహకారంతో
జీవితంలో ఇలా ముందుకు సాగుతూనే సెక్చు వల్ మైనారిటీల ఉద్యమాన్ని లేవనెత్తిం ది. సమాజంలో మార్పు తేవటానికి తన వంతు ప్రయత్నించిం ది. సెక్స్ వర్కర్‌గా పనిచేసినప్పుడు ఆమె కంటి నుం చి కన్నీళ్లు రాని రోజు లేదు. తనలాం టి ఎంతో మంది సెక్స్ వర్కర్ల బాధలను, గాథలను దగ్గరుండి చూసిం ది. అప్పుడు తాను ఒంటరి కాదని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరంలేదని తెలుసుకుం ది. కొత్త జీవితం దిశగా ఆలోచించిం ది. ఈ క్రమంలో ‘సంగమ’ అనే స్వచ్ఛంద సంస్థలో చేరిం ది. ఈ సంస్థ సెక్చువల్ మైనారిటీల కోసం పనిచేస్తోం ది. అక్కడ ఉన్నప్పుడు అక్కాయికి చదువు విలువ అర్థమైంది. దేశవ్యాప్తంగా సెక్చు వల్ మైనా రిటీలు తమ సమస్యలను వెల్లడించటానికి చట్టాల గురించి, ప్రభుత్వ విధాన నిర్ణయాల గురించి అవగాహన లేకపోవటాన్ని లోపంగా భావించింది. పదో తరగతి మధ్యలోనే మానేసిన అక్కాయి ఇంగ్లిష్ చక్కగా మాట్లాడటం నేర్చుకుంది. ‘అందేది’ అనే సంస్థను ఏర్పా టు చేసింది. ‘అందేది’ అంటే ఏకీభవించటం అని అర్థం .
అవార్డులు.. రివార్డులు..
ఈ సంస్థ ద్వారా సెక్స్ ధోరణులపై అవగాహన కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. 2014 అక్టోబర్‌లో ఇంటర్నేషనల్ బార్ అసోసియేషన్.. టోక్యోలో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో ‘సెక్చు వల్ మైనారిటీల న్యాయ పరమైన హక్కుల’పై వాయిస్ వినిపించాలని ఆమెను కోరిం ది. ట్రాన్స్జెండర్ల సమాజంలోమార్పు తీసుకొచ్చి నందుకు కర్ణాటక ప్రభుత్వం అక్కాయికి 2015లో ‘రాజ్యోత్సవ’ అనే అవార్డును అందించిం ది. ఇది ఆ రాష్ట్రంలో రెండో అతి పెద్ద పుర-స్కారం కావటం విశేషం. అరుదైన వ్యక్తులకు ఇచ్చే ఈ అవార్డులో భాగంగా రూ.లక్ష నగదు, బంగారు పతకం, జ్ఞాపిక బహూకరించారు. ఈ పురస్కారాన్నిఅందుకున్న తొలి ట్రాన్స్‌జెండర్ అక్కాయే . తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి నుంచి ఆహ్వానం అందుకుంది. సుప్రీంకోర్టు ట్రాన్స్‌జెండర్‌ను ‘థర్డ్ జెండర్’గా ప్రకటించగానే దేశంలో డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తొలి మహిళగా అక్కాయి గుర్తింపు పొందింది.
ట్రాన్స్ జెండర్లకు ఎక్కడికెళ్లినా ఇబ్బందులే
ట్రాన్స్ జెండర్ గా బతకటం చాలా కష్టం. జనాలు మా మొహం ముందే ఎగతాళిగా నవ్వుతుంటారు. చులకన చేసి మాట్లా డుతుంటారు. బస్సుల్లో, రైళ్లలో కలిసి ప్రయాణం చేయాలంటే ఇబ్బంది పడాల్సి వస్తోంది. పబ్లిక్ టాయిలెట్లు వాడుకోవటంలో నూ ట్రాన్స్ జెండర్లకు కష్టా లు తప్పట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీల్లో, ఆఫీసుల్లో జాబులు చేయలేకపోతున్నాం. ఏ విధంగా చూసినా మా సమస్యలు పరిష్కారమయ్యే సూచనలు కనబడట్లేదు. కానీ, మార్పు అనివార్యం. ఈ దశలో మనం పయనిస్తున్నాం.
– అక్కాయి
మనసు గెలిచిన వ్యక్తితో మనువు
ఎల్జీబీటీక్యూఐ(లెస్బియన్, గే, బైసెక్సు వల్,ట్రాన్స్‌జెండర్, క్వీర్, ఇంటర్ సెక్స్) కార్యకర్త వాసును అక్కాయి ఎనిమిదేళ్ల క్రితం కలిసింది.బెంగుళూరు గ్రామీణ జిల్లా మగది గ్రామానికి చెం దిన అతను సిటీకి వచ్చిన కొత్తలోఅక్కాయి సంస్థలో చేరాడు. కొన్నాళ్లు ఫ్రెండ్స్‌గానే ఉన్నారు. తర్వాత ప్రేమలో పడ్డారు.ముందు అతనే పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. కానీ ఆమె వెంటనే ఓకే చేయలేదు. కార్యకర్తగా తన లక్ష్యాలను వివరించింది. అయితే సన్నిహితుల సూచనలు, సలహాలతో పెళ్లి గురించి ఆలోచించిం ది. తనకు పిల్లలు పుట్టరని తెలిసి కూడా వాసు తనను ఇష్టపడటం ఆమెను కదిలించింది. పేరెంట్స్, బంధు మిత్రుల అంగీకారం, ఆశీస్సులతో ఇద్దరూ ఒక్కటయ్యారు.
డాక్టరేట్ అందుకున్న తొలి ట్రాన్స్ జెండర్
సెక్చు వల్ మైనారిటీ యాక్టివిస్ట్‌గా ‘శాం తి, విద్య’ కేటగిరీలో ‘వర్చువల్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా’ నుంచి 2016లో గౌరవ డాక్టరేట్ అందుకుం ది. దేశంలోనే తొలిసారిగా ఒక యూనివర్సిటీ నుంచి ఇలాంటి పట్టా పొందిన ట్రాన్స్‌జెండర్‌గా అక్కాయి నిలిచింది.సామాజిక వెలివేతకు గురవుతున్న ట్రాన్స్జెండర్ల హక్కుల కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది.
– కోడం పవన్ కుమార్