లోడ్ చార్జీల పేర ట్రాన్స్‌కో వడ్డింపులు

లోడ్ చార్జీల పేర  ట్రాన్స్‌కో వడ్డింపులు
  • అదనపు కిలోవాట్​కు రూ.3 వేలు చార్జీ
  • అవగాహన కల్పించని అధికారులు
  • అమోమయంలో వినియోగదారులు

కరీంనగర్, వెలుగు:  ఒక ఫ్యాన్.. టీవీ, ట్యూబ్ లైట్.. ఉన్న ఇంటికి మామూలుగానైతే కరెంటు బిల్లు  రూ. 250 నుంచి రూ. 350 వస్తుంది.  కానీ కొందరు వినియోగదారులకు  కరెంటు బిల్లు వేలల్లో ఉంటున్నది. తాము కరెంట్​ ఎక్కువగా వాడకున్నా బిల్లు ఎందుకు పెరిగిందో తెలయక ఆందోళన చెందుతున్నారు. లోడ్​ పెరుగుదల ఛార్జీల పేర వేలకు వేలు బిల్లుల్లో యాడ్​ చేస్తున్న ట్రాన్స్​కో ఆఫీసర్లు కస్టమర్లకు ఆ విషయం చెప్పడంలేదు. చార్జీల గురించి అవగాహన లేకపోవడంతో వినియోగదారులు  అయోమయానికి గురవుతున్నారు.

డెవలప్​మెంట్ చార్జీల మోత

సాధారణంగా కస్టమర్లు మీటర్లు తీసుకునే ముందు లోడ్ ను బట్టి కనెక్షన్లు ఇస్తారు.   మున్సిపాలిటీల్లో రెండు కిలో వాట్స్,  మండల కేంద్రాల్లో ఒక  కిలో వాట్ కనెక్షన్లు ఇస్తారు. గ్రామాల్లో  ఒక కిలో వాట్ కన్నా తక్కువ లోడ్​ ఉన్నా  కిలో వాట్ లోడ్​తోనే  కనెక్షన్​ ఇస్తున్నారు.ఒక కిలో వాట్ పర్మిషన్​ తీసుకుని  రెండు కిలోవాట్ల లోడ్ వినియోగిస్తే  అదనపు కిలో వాట్ కోసం డెవలప్ మెంట్ ఛార్జీల పేరిట రూ.2836 వసూలు  చేస్తున్నారు. దీనితో పాటు రూ. 400 సెక్యురిటీ డిపాజిట్ గా తీసుకుంటున్నారు.  లోడ్ పెరుగుదల  పేరిట ఒక్కో కస్టమర్లపై రూ.3236 అదనపు భారం పడుతుంది.

ఇంటిమేషన్ ఇస్తలేరు

ట్రాన్స్​కో సిబ్బంది ఆయా సర్కిల్స్​లో ప్రతి నెలా కొన్ని ఏరియాల్లో కరెంట్ బిల్లులను పరిశీలిస్తుంటారు. బిల్లులు తీసిన టైమ్​లో కస్టమర్ తన కనెక్షన్ తీసుకున్న దానికన్నా ఎక్కువ లోడ్​ వాడుతున్నారా అన్న విషయాన్ని చూస్తారు. మీటర్​ రీడింగ్​లో కనిపించే రెఫరెన్స్ మాక్సిమం డిమాండ్ ( ఆర్ఎండీ)  ద్వారా కస్టమర్ ఎంత లోడ్ వాడుతున్నాడో తెలుస్తుంది.  సిబ్బంది ఇన్స్​పెక్షన్ ​చేసినపుడే లోడ్​ పెరిగిన విషయం తెలుస్తుంది కాబట్టి.. అప్పుడే కస్ట​మర్​కు వివరించాలి. ఉన్న లోడ్ కన్నా ఎక్కువగా వినియోగిస్తున్నందువల్ల అదనపు చార్జీలు కట్టాలని చెప్పాలి.
ఈ మేరకు రెండు నెల ముందు  నోటీసులు ఇవ్వాలి. అప్పటికీ కస్టమర్​ చార్జీలు చెల్లించకపోతే  బిల్లులో యాడ్​ చేయాలి. ఫీల్డ్​ స్టాఫ్​ ఇవేవీ లేకుండానే లోడ్​ చార్జీలు నేరుగా బిల్లులో కలిపేస్తున్నారు. ఎప్పటిలాగా కరెంట్​ వాడినా బిల్లు ఇంత ఎలా పెరిగిందో అర్థం కాక కస్టమర్లు ఆందోళన చెందుతున్నారు.

ఆన్​లైన్​లో కనిపించవ్..

నోటీసులు ఇచ్చిన రెండు నెలల తర్వాత లోడ్​ చార్జీలు బిల్లులో కలపాలి. అయితే ఈ చార్జీలు అన్​లైన్​లో కనిపించడంలేదు. చాలామంది కస్టమర్లు కరెంట్​ బిల్లులు ఆన్​లైన్​లోనే కడుతున్నారు. కరెంట్ ఆఫీసుకు వెళ్లి బిల్లులు కట్టడం చాలావరకు తగ్గిపోయింది. లోడ్ చార్జీలు ఆన్ లైన్ లో కనిపించకపోవడంతో విద్యుత్​ వాడకానికి సంబంధించిన బిల్లు మాత్రమే చెల్లిస్తున్నారు.  రెగ్యులర్​గా బిల్లు కడుతున్నా.. లోడ్​ చార్జీల మీద వడ్డీలు పెరుగుతున్నాయి. లోడ్​ పెరిగిన కస్టమర్లకు ముందుగానే విషయం చెప్పేలా ట్రాన్స్​కో ఆఫీసర్లు ఫీల్డ్​ స్టాఫ్​కు గైడ్​లైన్స్​ ఇస్తే ఎవరికీ ఇబ్బంది ఉండదు.

For More News..

 ప్రైవేటు బాటలో.. 4 సర్కారీ బ్యాంకులు

ఈ కారు నిజంగా సూపర్.. చెట్లు, కొండలెక్కుతుంది.. ఎగురుతుంది

ప్రశ్నించే గొంతు మూగబోయింది

కేసీఆర్​పై బాహుబలి రేంజ్​లో డాక్యుమెంటరీ

ఎన్జీటీ వద్దన్నా.. ఏపీ సంగమేశ్వరం పనులు చేస్తోంది