- ట్రాన్స్ కో సీఎండీ వరుణ్ రెడ్డి
కాగజ్ నగర్, వెలుగు: రాష్ట్రంలో కోతల్లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, డిమాండ్‌కు తగినట్లు అదనపు సబ్ స్టేషన్లు నిర్మిస్తున్నామని ట్రాన్స్ కో సీఎండీ కార్నాటి వరుణ్ రెడ్డి అన్నారు. గురువారం ఆయన కాగజ్ నగర్ డివిజన్లో పర్యటించారు. కాగజ్ నగర్ యార్డు, చింతలమానేపల్లి మండలంలోని చింతలపాటి వద్ద కొత్తగా నిర్మిస్తున్న 132/33 సబ్ స్టేషన్ పనుల్ని పరిశీలించి మాట్లాడారు.
నెల రోజుల్లో విద్యుత్ సబ్ స్టేషన్ పనులు కంప్లీట్ చేసి ప్రారంభా నికి సిద్ధం చేయాలని ఆదేశించారు. డిమాండ్‌కు తగ్గట్టు సరఫరా చేసేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఇండ్లు, ఇటు కమర్షి యల్ వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. సబ్ స్టేషన్ ఆవరణలో మొక్క నాటారు. ఆయన వెంట పలువురు అధికారులున్నారు.