వికారాబాద్ జిల్లాలో ట్రాన్స్​కో ఎస్సీ ఆఫీస్ షురూ

వికారాబాద్ జిల్లాలో ట్రాన్స్​కో ఎస్సీ ఆఫీస్ షురూ

వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా కేంద్రంలో కొత్తగా రూ. 3.52 కోట్లతో నిర్మించిన ట్రాన్స్​కో ఎస్సీ కార్యాలయాన్ని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శనివారం ప్రారంభించారు. అదేవిధంగా వికారాబాద్ మండలం నారాయణ్​పూర్​లో రూ.  2.43 కోట్లతో కొత్తగా  33/11కేవీ సబ్ స్టేషన్, వికారాబాద్ కలెక్టరేట్ లో  రూ. 3.13 కోట్ల అంచనాతో 33/11కేవీ సబ్ స్టేషన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ట్రాన్స్​కో ఎస్సీ లీలావతి, ఆర్డీఓ వాసు చంద్ర, డీఈ సంజీవి, ఏడీఈ సత్యనారాయణరెడ్డి  తదితరులు  పాల్గొన్నారు.