వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగులు 27 మందిని బదిలీ చేస్తూ దేవాదాయ శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2009 నుంచి ఇప్పటిదాకా బదిలీలు చేపట్టలేదు. దీంతో 15 ఏళ్ల తర్వాత ఒకేసారి భారీగా బదిలీలు జరిగాయి. బదిలీ అయిన ఉద్యోగుల్లో ఏఈవో హరికిషన్, ఏఈవో ప్రతాప నవీన్, సూపరింటెండెంట్లు నటరాజ్, నాగుల మహేశ్, పత్తిపాక శ్రీనివాస్, శ్రీరాములు, హరిహారనాథ్, లక్ష్మణ్‌రావు, అరుణ్ఉన్నారు.
వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేస్తున్న సూపరింటెండెంట్ గోలి శ్రీనివాస్ సైతం బదిలీ అయ్యారు. 8 మంది సీనియర్అసిస్టెంట్లు, 10 మంది జూనియర్ అసిస్టెంట్లు ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఉత్తర్వులు అందుకున్న మూడు రోజుల్లో సంబంధిత ఆలయాల్లో విధుల్లో చేరాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు