ఆదిలాబాద్లో పలువురు ఎస్​ఐల ట్రాన్స్​ఫర్

కోల్​బెల్ట్, వెలుగు: కాళేశ్వరం జోన్-–1 పరిధిలోని పలువురు ఎస్​ఐలను బదిలీ చేస్తూ గురువారం పోలీస్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మంచిర్యాల జిల్లాకు చెందిన నలుగురు ఎస్​ఐలను ట్రాన్స్​ఫర్ చేశారు. మందమర్రి ఎస్​ఐగా పనిచేస్తున్న చంద్రకుమార్​ను లక్సెట్టిపేటకు, అక్కడి ఎస్​ఐ ఎస్​.లక్ష్మణ్​ను రామగుండం వీఆర్​కు, మందమర్రిలో రెండో ఎస్ఐగా పనిచేస్తున్న శివానికి అదే పోలీస్ స్టేషన్​ ఎస్​హెచ్​ఓగా బాధ్యతలు అప్పగిం చారు. రామగుండం వీఆర్​లో కొనసాగు తున్న గుండెటి రాజవర్ధన్​ను మంచిర్యాల టౌన్ నాలుగో ఎస్ఐగా బదిలీ చేశారు.