
కోల్‌బెల్ట్, వెలుగు : సింగరేణి సంస్థలో వివిధ ఏరియాల్లో పనిచేస్తున్న పలువురు ఏజీఎం, డీజీఎం, మేనేజర్, డిప్యూటీ, అడిషనల్ మేనేజర్ స్థాయి ఉన్నతాధికారులను మేనేజ్మెంట్ బదిలీ చేసింది. బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీరాంపూర్ ఏరియా ఎస్ వో టూ జీఎంగా పనిచేస్తున్న ఏజీఎం కె.రఘు కుమార్‌ను రామగుండం రీజియన్ సేఫ్టీ ఆఫీసర్‌గా బదిలీ చేసింది. శ్రీరాంపూర్ ఏరియా ఎస్ఆర్పీ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ అధికారి, డీజీఎం వి.పురుషోత్తంరెడ్డిని అదే ఏరియా ఎస్వోటూ జీఎంగా నియమించింది.
అడ్రియాల ప్రాజెక్టు ఎస్ వోటూ జీఎంగా పనిచేస్తున్న ఏజీఎం డి.బైద్యను రామగుండం-1 ఏరియా సేఫ్టీ అధికారిగా, హైదరాబాద్ మార్కెట్, మూవ్మెంట్లో డీజీఎం టి.శ్రీనివాస్‌ను ఎస్ఆర్పీ ఓపెన్ కాస్ట్ పీవోగా బదిలీ చేసింది. రామగుండం-1 ఏరియా సేఫ్టీ ఆఫీసర్ బండి సత్యనారాయణను అడ్రియాల ప్రాజెక్టుకు, రామగుండం-1 క్వాలిటీ మేనేజ్మెంట్కు చెందిన ఎన్.శ్రీధర్‌ను శ్రీరాంపూర్ ఏరియా ఆర్కే-7 గనికి, రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ మైన్ మేనేజర్‌గా పనిచేస్తున్న డీజీఎం సీహెచ్.వెంకటేశ్వర్లును ఇందారం-1ఏ గనికి, ఆర్కే-7 గనికి చెందిన డీజీఎం సాయిప్రసాద్‌ను రామగుండం-1 క్వాలిటీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కు యాజమాన్యం బదిలీ చేసింది.
హైదరాబాద్ సీఎండీ ఆఫీస్‌లో ఎస్వోఎం కె.కృష్ణాచారిని ఇల్లందు ఏరియా సేఫ్టీ ఆఫీసర్‌గా, ఇందారం-1ఏ మైన్ మేనేజర్ బి.బ్రహ్మాజీరావును శ్రీరాంపూర్ఓసీపీకి, అదే ఓసీపీలో పనిచేస్తున్న సుధీర్ జయవంతరావును రామకృష్ణాపూర్ ఓపెన్ కాస్ట్ మైన్‌కు, కొత్తగూడెం ఎస్అండ్పీ అడిషనల్ మేనేజర్‌గా పనిచేస్తున్న డి.రమణారెడ్డిని మణుగూరు పీకే ఓసీపీకి, హైదరాబాద్ మార్కెటింగ్ -మూవ్‌మెంట్‌కు చెందిన పి.మహేందర్‌రెడ్డిని రామగుండం-2 ఏరియా ఓసీపీ-3కి, మణుగూరు ఎంవీటీసీ నుంచి జి.లక్ష్మన్ను మణుగూరు ఎస్ఎంఎస్ ప్లాంట్‌కు, కొత్తగూడెం ఏరియా వీకే-7 మైన్ అడిషనల్మేనేజర్ జె.శంకర్‌ను కోట్లగూడెం ఏరియా ఎస్అండ్పీ విభాగానికి ట్రాన్స్ఫర్ చేశారు. మందమర్రి ఏరియా ఆర్కే-1ఏ మైన్ డిప్యూటీ మేనేజర్బూడిద జయంత్ కుమార్‌ను అడ్రియాల ప్రాజెక్టుకు, కార్పొరేట్ఎన్విరాన్మెంట్ సెల్ డిప్యూటీ మేనేజర్ఎ.సునీల్ కుమార్‌ను మణుగూరు పీకే ఓసీపీకి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.