ఏపీలో పలువురు ఐపీఎస్ ల బదిలీ..

ఏపీలో పలువురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది ప్రభుత్వం. ముగ్గురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ఏపీ సర్కార్. ఏపీఎస్పీ బెటాలియన్ అడిషనల్ డీజీ అతుల్ సింగ్ ను ఏసీబీ డీజీగా నియమించింది.విశాఖ సీపీ  రవిశంకర్ అయ్యన్నార్ ను సీఐడీ అడిషనల్ డీజీగా, శాంతిభద్రతల అడిషనల్ డీజీ శంకబ్రత బాగ్చిని విశాఖ సీపీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.

ఏపీకి సీఎంగా చంద్రబాబు నాలుగవసారి బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన నాటి నుండే పాలనాపరమైన ప్రక్షాళన మీద ఫోకస్ పెట్టారు చంద్రబాబు. ఈ క్రమంలో పలు శాఖలకు సంబంధించిన అధికారులతో వరుస సమీక్షలు నిర్వహిస్తూ పాలనను పరుగులు పెట్టిస్తున్నారు సీఎం చంద్రబాబు.ఇప్పటికే పలువురు ఉన్నతాధికారులను బదిలీ చేసిన సీఎం, తాజాగా సీనియర్ ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.