రైతుకు తెలియకుండానే పట్టా మార్పిడి

రైతుకు తెలియకుండానే పట్టా మార్పిడి

కాగజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు : ఓ మహిళా రైతుకు తెలియకుండానే ఆమె పేరున ఉన్న రెండెకరాల భూమి మరో మహిళ పేరు మీదకు మారింది. ఈ ఘటన చింతలమానేపల్లి మండలం గంగాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గ్రామంలో వెలుగు చూసింది. గ్రామానికి చెందిన అనపర్తుల శంకరమ్మకు అదే గ్రామ శివారులోని 91/382/1 సర్వే నంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రెండు ఎకరాల భూమి ఉంది. ఆ భూమి మొదట్లో శంకరమ్మ తండ్రి పేరున ఉంది. శంకరమ్మ ఒక్కతే కుమార్తె కావడంతో ఆయన చనిపోయాక భూమి శంకరమ్మ పేరుపైన మారింది. ఇటీవల రైతుబంధు రాకపోవడంతో ఆమె కొడుకు అంజన్న ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వెళ్లి విచారించగా ఆ భూమి గతేడాది ఆగస్టులో మహారాష్ట్రలో ఉంటున్న గంగా గోపాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బోలు పేరిట మారినట్లు బయటపడింది. 

దీంతో తన పేరున ఉన్న భూమిని తనకు తెలియకుండా వేరొకరి పేరున ఎలా మార్చారంటూ శంకరమ్మ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ ఏడాది మార్చిలో కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఫిర్యాదు చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని శంకమ్మ ఆవేదన వ్యక్తం చేసింది. ఆఫీసర్లు స్పందించి తన భూమిని తన పేరున తిరిగి పట్టాలని చేయాలని కోరింది. అయితే లావుని పట్టా అయిన భూమి పట్టాదార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చనిపోయాకే మరొకరి పేరున మార్చాల్సి ఉంటుంది. కానీ శంకరమ్మ బతికి ఉండగానే పట్టా మార్చడంపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై డిప్యూటీ తహసీల్దార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మస్కుర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అలీ మాట్లాడుతూ భూమి విషయంలో మిస్టేక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జరిగిందని, దాన్ని రెక్టిఫై చెప్పారు.