- దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో 17 మంది జడ్జిల నియామకం
న్యూఢిల్లీ, వెలుగు: దేశ వ్యాప్తంగా పలు హైకోర్టుల్లో 17 మంది జడ్జిలు, అదనపు జడ్జిల నియమాకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేశారు. అలాగే వివిధ హైకోర్టుల్లో విధులు నిర్వహిస్తోన్న 16 మంది జడ్జిల బదిలీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ మెఘ్వాల్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఇందులో తెలంగాణ హైకోర్టుకు చెందిన జస్టిస్ మున్నూరి లక్ష్మణ్, జస్టిస్ జి.అనుపమ చక్రవర్తి వరుసగా రాజస్థాన్, పాట్నా హైకోర్టులకు బదిలీ అయ్యారు. కర్నాటక హైకోర్టులో జడ్జిగా ఉన్న జస్టిస్ నరేంద్ర ఏపీకి ట్రాన్స్‌ఫర్ అయ్యారు. ఏపీ హైకోర్టు జడ్జి జస్టిస్ సి.మానవేంద్రనాథ్ రాయ్ గుజరాత్‌కు, అదనపు జడ్జి జస్టిస్ దుప్పల వెంకట రమణ మధ్యప్రదేశ్‌కు బదిలీ అయ్యారు. దీంతో పాటు హరినాథ్ నూనెపల్లి(అడ్వకేట్), కిరణ్మయి కనపర్తి (అడ్వకేట్), సుమతి జగదం (అడ్వకేట్), న్యాయపతి విజయ్ ఏపీ హైకోర్టులో అదనపు జడ్జిలుగా నియమితులయ్యారు.