
పంజాగుట్ట, వెలుగు : ‘నా కారునే ఆపుతావా.. ఎంత ధైర్యం..నేను తల్చుకుంటే నువ్వు ట్రాన్స్ఫర్అయిపోతవ్’ అంటూ ఓవాహనదారుడు పంజాగుట్ట ట్రాఫిక్ఎస్సైపై చిందులు తొక్కాడు. ఎస్సై మోజిరామ్కథనం ప్రకారం.. గురువారం సాయంత్రం తాజ్‌కృష్ణ హోటల్నుంచి కేసీపీ జంక్షన్ వైపు టీఎస్ 09 ఎఫ్యూ 0786 నంబర్ఫోర్వీలర్ వస్తోంది. వాహనాల చెకింగ్‌లో భాగంగా కేసీపీ వద్ద చలాన్లు వెరిఫై చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు ఆ వాహనాన్ని ఆపారు.
దీంతో అసహనానికి గురైన కారులోని అఫ్రజ్‘ఎంత ధైర్యం నీకు.. మా వాహనాన్నే ఆపుతావా? అడ్డు తొలగకపోతే ట్రాన్స్ఫర్చేయిస్తా’ అని వార్నింగ్ఇచ్చాడు. అదేమీ పట్టించుకోని ఎస్సై మోజిరామ్సదరు వాహనంపై చలాన్లు పరిశీలించగా, రూ.4 వేల పెండింగ్కనిపించింది.
దీంతో ఆ వాహనాన్ని ట్రాఫిక్పోలీస్స్టేషన్కు తరలించారు. 4 వేల చలాన్లతోపాటు వెయ్యి ఫైన్ విధించడంతో ఆ డబ్బులు కట్టేసి తీసుకువెళ్లిపోయాడు.