యాదాద్రిలో 56 మంది ఉద్యోగుల బదిలీ

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ కొనసాగుతోంది. జీవో నంబర్ 80 ప్రకారం నాలుగేండ్లు పైబడి ఒకేచోట పనిచేస్తున్న జూనియర్​ అసిస్టెంట్​ నుంచి కిందిస్థాయి ఉద్యోగులు బదిలీ కోసం ఇదివరకే ఆప్షన్లు చేసుకున్నారు. ఇందులో భాగంగా యాదాద్రి కలెక్టరేట్​లో ఎడ్యూకేషన్, అగ్రికల్చర్, పంచాయతీరాజ్, సహకార, మహిళా శిశు సంక్షేమ, ట్రైజరీ, బీసీ, గిరిజన సంక్షేమ, మార్కెటింగ్, వైద్యారోగ్య, పశు సంవర్ధక, ఆర్అండ్ బీ డిపార్ట్​మెంట్లకు చెందిన ఉద్యోగులకు అడిషనల్​కలెక్టర్లు పీ బెన్​ షాలోమ్, గంగాధర్​ నేతృత్వంలో మంగళవారం కౌన్సిలింగ్​నిర్వహించారు.

సీనియార్టీ ఆధారంగా 56 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. బుధవారం మొహరం సెలవు కావడంతో గురువారం రెవెన్యూ, జడ్పీ, ఇంటర్​ ఎడ్యూకేషన్, ఎస్సీ సంక్షేమ శాఖల ఉద్యోగులను కౌన్సిలింగ్​నిర్వహించనున్నారు. కౌన్సిలింగ్​లో కలెక్టరేట్​ ఏవో జగన్మోహన్​ప్రసాద్​, వివిధ డిపార్ట్​మెంట్ల ఆఫీసర్లు, ఉద్యోగుల అసోసియేషన్​ లీడర్లు మందడి ఉపేందర్​ రెడ్డి, భగత్, ఎండీ ఖదీర్​ ఉన్నారు.