
వరంగల్/ హనుమకొండ/ ములుగు, వెలుగు : రాష్ట్రంలో శనివారం ఐఏఎస్ ఆఫీసర్ల బదిలీలు జరిగిన నేపథ్యంలో వరంగల్, హనుమకొండ, ములుగు కలెక్టర్లు బదిలీ అయ్యారు. ఓరుగల్లులోని ఆరు జిల్లాల్లో జనగామ, మహబూబాబాద్ మినహా మిగతా నాలుగు జిల్లాల కలెక్టర్లు మారారు. వరంగల్ కలెక్టర్‍గా ప్రావీణ్య స్థానంలో 2015 ఐఏఎస్ బ్యాచ్‍కు చెందిన సత్యశారదా దేవి నియామకమయ్యారు.
శారదాదేవి ఇన్నాళ్లు అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్లో జాయింట్ సెక్రటరీగా పనిచేశారు. వరంగల్ కలెక్టర్ ప్రావీణ్య హనుమకొండ జిల్లాకు వచ్చారు. ములుగు జిల్లా కలెక్టర్‍గా జగిత్యాల అదనపు కలెక్టర్‍గా పని చేస్తున్న టీఎస్దివాకరను ప్రభుత్వం నియమించింది.