న్యూఢిల్లీ: దేశ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా ‘పీఎం గతిశక్తి’ స్కీమ్‌ను తీసుకొచ్చామని ప్రధాని మోదీ తెలిపారు. దీన్ని ప్రారంభించి మూడేండ్లయిన సందర్భంగా ఆదివారం సోషల్ మీడియా ‘ఎక్స్’లో ఆయన పోస్టు పెట్టారు. ‘‘పీఎం గతిశక్తితో మల్టీమోడల్ కనెక్టివిటీ మెరుగుపడింది. వేగంగా అభివృద్ధి జరుగుతున్నది.
ఇది లాజిస్టిక్స్ రంగానికి బూస్టింగ్ ఇస్తున్నది. కొత్త అవకాశాలను సృష్టిస్తున్నది” అని మోదీ పేర్కొన్నారు. పీఎం గతిశక్తి గొప్ప స్కీమ్ అని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ‘‘దేశంలో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ లో పీఎం గతిశక్తి కీలక పాత్ర పోషిస్తున్నది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు ఉపయోగపడుతున్నది. మల్టీమోడల్ కనెక్టివిటీ, ఆర్థిక వృద్ధికి పునాది వేసింది” అని ‘ఎక్స్’లో పేర్కొన్నారు.