ట్రాన్స్‌ఫార్మర్‌ని కూడా వదలని దొంగలు

ట్రాన్స్‌ఫార్మర్‌ని కూడా వదలని దొంగలు

షమ్లి: దొంగలు ఏవైనా విలువైన వస్తువులు, డబ్బులు, నగలు దోచుకెళ్లడం చూశాం, విన్నాం. కానీ, ఇక్కడ మాత్రం దొంగలు కరెంట్ ట్రాన్స్‌ఫార్మర్‌ని ఎత్తుకెళ్లారు. ఉత్తరప్రదేశ్‌లోని షమ్లి పట్టణంలో జరిగిందీ ఘటన. సాయుధులైన దొంగలు ఒక మినీ ట్రక్కులో విద్యుత్ సబ్ స్టేషన్‌కి వచ్చారు. అక్కడ విధుల్లో ఉన్న హరీందర్ సింగ్‌ను దొంగలు బంధించి ట్రాన్స్‌ఫార్మర్‌ను కూల్చి రూ .8 లక్షల విలువైన విలువైన వస్తువులను దోచుకున్నారు. సింగ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దోపిడీలో స్థానికుల ప్రమేయం ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

For More News..

రెండు బస్సుల మధ్య నలిగిన బైకర్.. సీసీ కెమెరా వీడియో