ట్రాన్స్​ఫార్మర్ల​ చోరీ ముఠా అరెస్ట్

నిజాంసాగర్(ఎల్లారెడ్డి), వెలుగు : నిజాంసాగర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ట్రాన్స్​ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైర్లను దొంగిలిస్తున్న నిందితులను డీఎస్పీ జగన్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిజాంసాగర్ పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి నుంచి నాందేడ్​ వైపు వెళ్తున్న ఓమినీ వెహికల్​ను నర్సింగ్ రావ్ పల్లి రోడ్డుపై ఆపి తనిఖీ చేయగా నలుగురు వ్యక్తులు కాపర్ వైర్ బెండళ్లను నాందేడ్ లో విక్రయించేందుకు తీసుకెళ్తున్నట్లు  తెలిపారు. జహీరాబాద్​కు చెందిన షాబుద్దీన్, రబ్బానీ ఉస్మాన్, అహ్మద్,షేక్ ఖలీమ్ ముఠాగా దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు. వీరి నుంచి 10. 5 క్వింటాళ్ల కాపర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కాపర్​విలువ సుమారు రూ. 8,50,000 ఉంటుందన్నారు. సీఐ మురళీ, సీసీఎస్ ఎస్ఐ ఉస్మాన్, పోలీసులు సంగమేశ్వర్, శ్యామ్, సురేందర్ పాల్గొన్నారు.