6 ట్రాన్స్​ఫార్మర్లను ధ్వంసం చేసి.. కాపర్​ వైర్లు, ఆయిల్​ చోరీ

ఇందల్వాయి, వెలుగు: మండలంలోని అన్సాన్​పల్లి లో గురువారం అర్ధరాత్రి  ట్రాన్స్​ఫార్మర్​దొంగలు బీభత్సం సృష్టించారు. స్థానికుల వివరాల ప్రకారం ఇందల్వాయి– ధర్పల్లి  మెయిన్​రోడ్డు  సమీపంలో గల వరి చేలలో   6 ట్రాన్స్​ఫార్మర్లను  ధ్వంసం చేశారు. వాటిలోని కాపర్​వైర్, ఆయిల్ ఎత్తుకెళ్లారు. ఎండాకాలం ఓ పక్క భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక ఇబ్బంది పడుతున్న రైతులు..  ట్రాన్స్​ఫార్మర్లు ధ్వంసం కావడంతో పొలాలు ఎలా పారించాలని  ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్​శాఖ ఆఫీసర్లు వీలైనంత త్వరగా ట్రాన్స్​ఫార్మర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.