
Mutibagger Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీల్లో పెన్నీ స్టాక్స్ కోసం రోజూ చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు తమ వేట కొనసాగిస్తూనే ఉంటారు. ప్రధానంగా మార్కెట్ల కరెక్షన్ సమయంలో అందుబాటు ధరల్లోకి వచ్చే ఈ చిన్న స్టాక్స్ సరిగ్గా ఎంచుకోవటం ఎంత లాభదాయకమో, తేడా జరిగితే డబ్బులు మెుత్తం ఖాళీ కావటం కూడా అంతే ప్రమాదకరం. అయితే సరైన రీసెర్చ్ చేసిన తర్వాత దీర్ఘకాలిక వ్యూహంతో మంచి పెన్నీ స్టాక్స్ కొనుగోలు పెట్టుబడిదారులకు డబ్బుల వర్షం కురిపిస్తుందని ఈ మల్డీబ్యాగర్ స్టాక్ నిరూపించింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ రెక్టిఫయర్స్ కంపెనీ షేర్ల గురించే. వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్ల నుంచి కంపెనీ షేర్ల ఏకంగా 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకుతూ పెరుగుతూనే ఉన్నాయి. దీంతో శుక్రవారం మార్కెట్ల ముగింపు నాటికి కంపెనీ షేర్ల ధర ఒక్కోటి ఎన్ఎస్ఈలో రూ.544.60 వద్ద ప్రయాణాన్ని ముగించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఏడాది ప్రాతిపదికన రెండితలై రూ.94.20 కోట్లకు చేరుకోవటమే దీనికి కారణంగా తెలుస్తోంది.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కంపెనీ 2025 మెుత్తం ఆర్థిక సంవత్సరంలో రూ.216.44 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అలాగే ఇదే సమయంలో కంపెనీ ఆర్డర్ బుక్ రూ.5వేల 132 కోట్ల వద్ద ఉండటం గమనార్హం. అయితే ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఆర్డర్ బుక్ రూ.8వేల కోట్లకు చేర్చాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ నువామా కంపెనీ అమ్మకాలు 32 శాతం పెరుగుదలను హైలైట్ చేసింది. అలాగే బలమైన ఆర్డర్లు కలిగి ఉండటంపై సానుకూల ధృక్పదాన్ని ప్రకటించింది.
దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల దశ తిరిగింది..
ఒక్కసారి స్టాక్ జర్నీని వెనక్కి తిరిగి పరిశీలిస్తే.. 5 ఏళ్ల కిందట కంపెనీ షేర్ ధర ఒక్కోటి కేవలం రూ.3.45 వద్ద ఉంది. ఆ సమయంలో ఎవరైనా పెట్టుబడిదారుడు ఈ కంపెనీ షేర్లలో రూ.లక్ష పెట్టుబడి పెట్టి దానిని ఇప్పటి వరకు కొనసాగించి ఉంటే.. ప్రస్తుత మార్కెట్ లెక్కల ప్రకారం వారి పెట్టుబడి విలువ ఏకంగా రూ.కోటి 58 లక్షలకు చేరుకుంది. అంటే కేవలం లక్ష పెట్టుబడితో ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో కోటీశ్వరులుగా మారిపోయారు. ప్రస్తుతం కంపెనీ తన ఉత్పత్తులను ఆసియా, ఆఫ్రికా, మధ్యప్రాశ్చంలోని దేశాలకు ఎగుమతి చేస్తోంది. కంపెనీ రైల్వేల నుంచి రెన్యూవబుల్ ఎనర్జీ వరకు అనేక రంగాల్లోని కంపెనీలకు సేవలను అందిస్తోంది.
NOTE: పైన అందించిన వివరాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటి ఆధారంగా ఎలాంటి పెట్టుబడి నిర్ణయాలు తీసుకోకండి. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టోల్లో పెట్టుబడులు నష్టాలతో కూడుకున్నవి. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకోవటానికి ముందుగా మీ ఆర్థిక సలహాదారులను సంప్రదించటం ఉత్తమం. మీరు తీసుకునే నిర్ణయాలకు V6 యాజమాన్యం లేదా ఉద్యోగులు ఎట్టిపరిస్థితుల్లోనూ బాధ్యత వహించరు.