శంకర్ నాయక్, షర్మిల సారీ చెప్పాలి: ట్రాన్స్ జెండర్

శంకర్ నాయక్, షర్మిల సారీ చెప్పాలి: ట్రాన్స్ జెండర్

తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కారణంగా ఎమ్మెల్యే శంకర్ నాయక్, వైఎస్ షర్మిల క్షమాపణ చెప్పాలని ట్రాన్స్ జెండర్లు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయాలకు సంబంధించిన కార్యక్రమాల్లో కొజ్జా అనే పదాన్ని వాడటం ఎంత వరకు సమంజసమని  ట్రాన్స్ జెండర్ కృష్ణ ప్రశ్నించారు. పదే పదే ఆ పదాన్ని వాడుతూ తమ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తమతో ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చినవాళ్లు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. తమకూ అన్ని చట్టాలు ఉన్నాయని.. పెద్ద పెద్ద హోదాల్లో ఉండి తమను ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అని ఆరోపించారు. సమాజాన్ని తిడుతున్న వాళ్లు ప్రజల్ని ఎలా పాలిస్తారని నిలదీశారు. తమకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

రాజకీయ నాయకుల మాటల వల్ల తమ మనోభావాలు దెబ్బ తింటున్నాయని ట్రాన్స్ జెండర్ అవంతిక అన్నారు. ఇప్పుడిప్పుడే సమాజంలో హుందాగా బ్రతుకుతున్నామని.. ఇలాంటి వాఖ్యలు చేయొద్దన్నారు. ఇక పై కొజ్జా లాంటి పదాలు వాడి తమను తిడితే.. ఎవరైనా సరే వాళ్లను రాష్ట్రంలో తిరగనివ్వకుండా చేస్తామన్నారు. ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తారో చూస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ట్రాన్స్ జెండర్ల కోసం కొత్త చట్టం తీసుకురావాలని అవంతిక డిమాండ్ చేశారు.