ట్రాన్స్‌జెండర్‌ని ముక్కలుగా నరికి హత్య : పోలీస్ స్టేషన్ ముందు హిజ్రాల ఆందోళన

హైదరాబాద్ : సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విషాద ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఫతేనగర్ పిట్టల బస్తీలో ట్రాన్స్ జెండర్ ను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా ముక్కలుగా నరికి చంపారు. నిర్మానుష్య ప్రాంతంలో ట్రాన్స్ జెండర్  డెడ్ బాడీని చూసిన స్థానికులు 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైంది షీలా (అలియాస్ షేక్ సాజిద్ అహ్మద్) గా పోలీసులు గుర్తించారు. 

హత్యకు సంబంధించి క్లూస్ టీం ఆధారాల సేకరిస్తున్నారు. దుండగులు డబ్బుల కోసమే ఈ హత్య చేసి ఉంటారని బాలానగర్‌ ఏసిపి హనుమంతరావు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గంజాయి మత్తులో హత్య చేశారని కొందరు హిజ్రాలు చెప్తున్నారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ ముందు 200 మంది హిజ్రాలు ఆందోళన చేస్తున్నారు. హత్య చేసిన వారిని గుర్తించి త్వరగా అరెస్టు చేస్తానని పోలీసులు హామీ ఇవ్వడంతో ట్రాంజెండర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ALSO READ | కన్నీళ్లు వస్తున్నాయి : చెల్లెలి శవాన్ని భుజాన మోస్తూ.. ఇంటికి తీసుకెళ్లిన అన్న