రైలు ప్రమాదం.. ట్రాన్స్‌‌‌‌జెండర్‌‌‌‌ మృతి

రైలు నుంచి జారిపడి ఓ ట్రాన్స్‌‌‌‌జెండర్‌‌‌‌ మృతి చెందిన ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లిలో ఆదివారం జరిగింది.   రైల్వే పోలీసుల కథనం ప్రకారం ..  సంగెం మండలం వెలుగూరు స్టేషన్‌‌‌‌ తూర్పు తండాకు చెందిన ట్రాన్స్‌‌‌‌జెండర్‌‌‌‌ బాదావత్‌‌‌‌ అనిల్‌‌‌‌ అలియాస్ దివ్య (25) శాతావాహన ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌లో సికింద్రాబాద్‌‌‌‌ నుంచి కాజీపేటకు వస్తున్నారు. రఘునాథపల్లి స్టేషన్‌‌‌‌ వద్దకు రాగానే డోర్‌‌‌‌ వద్ద కూర్చున్న దివ్య ప్రమాదవశాత్తు కిందపడి స్పాట్‌‌‌‌లోనే చనిపోయింది. అదే రైలులో ప్రయాణిస్తున్న బానోతు బాలు దివ్యను గుర్తుపట్టి పేరెంట్స్‌‌‌‌కు, రైల్వే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని జనగామ రైల్వే కానిస్టేబుల్‌ నరేశ్‌ వివరించారు.