డెలావర్: అమెరికా సెనేట్‌కు జరిగిన ఎన్నికల్లో డెలావేర్ నుంచి డెమోక్రాట్ పార్టీ తరఫున పొటీ చేసిన ట్రాన్స్‌జెండర్ సారా మెక్ బ్రైడ్ విజయం సాధించింది. తొలిసారి అధికారికంగా సెనేట్‌లోకి అడుగుపెట్టనున్న ట్రాన్స్ జెండర్‌గా ఆమె రికార్డులకెక్కారు. మూడింట రెండు వంతుల మంది ఓటర్లు ఆమెకే ఓటేశారు. ప్రత్యర్థి, రిపబ్లికన్ అభ్యర్థి జాన్ వాలెన్ 3పై ఆమె విజయం సాధించారు. ఈ సందర్భంగా సారా మాట్లాడారు. ‘‘లింగ మార్పిడి విషయంలో స్వేచ్ఛను రక్షించేందుకు అమెరికా కట్టుబడి ఉంటుందనే విషయాన్ని డెలావర్ ఓటర్లు చాటిచెప్పారు.
అమెరికన్లుగా మనకందరికీ కావాల్సిన ప్రజాస్వామ్యం ఇదే.. చైల్డ్ కేర్ కు సంబంధించిన ఖర్చులు అందరికీ అందుబాటులో ఉండేందుకు చర్యలు తీసుకుంట. ట్రాన్స్ జెండర్ల హక్కుల కోసం పాటుపడ్తాను. సభలో నా వంతు గళం వినిపిస్తాను. ఉద్యోగులకు మెడికల్ లీవ్ సౌకర్యం కల్పిస్తా. హౌసింగ్, హెల్త్ కేర్ విషయాల్లో ఎదురవుతున్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్త’’ అని సారా హామీ ఇచ్చారు.