సెనేటర్‌‌‌‌గా గెలిచిన ట్రాన్స్‌‌జెండర్‌‌‌‌

సెనేటర్‌‌‌‌గా గెలిచిన ట్రాన్స్‌‌జెండర్‌‌‌‌

యూఎస్‌‌: అమెరికా డెలావర్‌‌‌‌ స్టేట్‌‌కు సెనేట్‌‌గా ట్రాన్స్‌‌జెండర్‌‌‌‌ ఎన్నికయ్యారు. ఎల్‌‌జీబీటీక్యూ కమ్యూనిటీ నుంచి అతిపెద్ద పదవి సాధించిన వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. రిపబ్లికన్‌‌ కేండిడేట్‌‌ స్టీవ్‌‌ వాషింగ్టన్‌‌ను ఓడించారు. ఆమె గెలిచిన స్టేట్‌‌లో అతిపెద్ద సిటీ విల్మింగ్టన్‌‌, బెల్లోఫాంటె, క్లేమాంట్‌‌ ఉన్నాయి. డిగ్నిటీ, పీస్‌‌ ఆఫ్‌‌ మైండ్‌‌తో జీవించడానికి ప్రజలతో పోరాడడానికి నేను చాలా కష్టపడ్డానని పోయిన ఏడాది కేండిడేట్‌‌గా ప్రకటించిన సమయంలోనే మెక్‌‌బ్రైడ్‌‌ చెప్పారు. ఎల్‌‌జీబీటీక్యూ అడ్వకసీ గ్రూప్‌‌ హ్యూమన్‌‌ రైట్స్‌‌ కేంపెయిన్‌‌ మాజీ స్పోక్స్‌‌పర్సన్‌‌ అయిన మెక్‌‌బ్రైడ్‌‌.. ట్రాన్స్‌‌జెండర్‌‌‌‌ కావడం వల్ల అమెరికన్‌‌ యూనివర్సిటీ స్టూడెంట్‌‌ బాడీ ప్రెసిడెంట్‌‌  పదవిని వదులుకోవడం అప్పట్లో సంచలనం సృష్టించింది. కాలేజీలో చదువుతున్న టైమ్‌‌లో.. ఒబామా అడ్మినిస్ట్రేషన్‌‌లో వైట్‌‌హౌస్‌‌లో పనిచేసిన మొట్టమొదటి ట్రాన్స్‌‌జెండర్‌‌‌‌గా గుర్తింపు పొందారు.

For More News..

అమెరికా ఫైనల్ రిజల్ట్ ఎటూ తేలకుంటే ఏమైతది?

కరోనాపై పత్రికల పోరాటం.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న పత్రికా రంగం

రజనీకాంత్ బీజేపీకి అక్కరకు వస్తారా!