నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్ లోనే హిజ్రాలు రెచ్చిపోయారు. రెండు వర్గాలుగా మారి దారుణంగా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం పోలీస్ స్టేషన్ కు వచ్చింది. రెండు వర్గాలు ఎదురు పడటంతో పోలీస్ స్టేషన్ లోనే రాళ్లు, చెప్పులతో కొట్టుకున్నారు.
పోలీసు స్టేషన్ లోనే ఇంత జరుగుతున్నా..ఏం చేయాలో తెలియక పోలీసులు అయోమయంలో పడ్డారు. వారి గొడవను చూస్తూ ఉండిపోయారు. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హిజ్రాలు కొట్టుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ వివాదంపై రెండు వర్గాల హిజ్రాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు.