హైదరాబాద్లో ట్రాన్స్జెండర్స్ హల్చల్..10 మంది అరెస్ట్

హైదరాబాద్లో ట్రాన్స్జెండర్స్ హల్చల్..10 మంది అరెస్ట్

హైదరాబాద్లో స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న ట్రాన్స్ జెండర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పీటీ కాలనీ, కట్టకింద కళ్లు కాంపౌండ్ దగ్గర నివాసం ఉంటున్న 10 మంది ట్రాన్స్జెండర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు శనివారం (మార్చి1) రాత్రి రైడ్స్ నిర్వహించారు. 

పీఅండ్ టీకాలనీ, కట్టకింద కల్లు కాంపౌండ్ ప్రాంతంలో ట్రాన్స్జెండర్స్ అసాంఘిక కార్యకలాపాలతో రెడ్ లైట్ ఏరియాగా మార్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు రైడ్స్ చేశారు. వీరు ఎక్కడి నుంచి వచ్చారు.. ఎంత కాలంనుంచి ఇక్కడు ఉంటున్నారనేదానిపై ఆరాతీస్తున్నారు. విచారణ అనంతరం రిమాండ్ తరలించనున్నారు. 

ALSO READ | ప్రేమకు అడ్డొస్తుందని..ప్రియురాలి తల్లిపై ప్రేమోన్మాది దాడి