
బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమను అవమానించారిని ట్యాంక్ బండ్ పై నిరసనకు దిగారు ట్రాన్స్ జెండర్లు. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమితులైన ట్రాన్స్ జెండర్స్ పట్ల బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రవర్తించిన తీరును నిరసిస్తూ... ట్యాంక్ బండ్ పై ఉన్న శ్రీశ్రీ విగ్రహం ముందు ట్రాన్స్ జెండర్లు , ట్రాఫిక్ అసిస్టెంట్స్ నిరసన చేపట్టారు.
అసెంబ్లీలో గురువారం (మార్చి 27) మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... తమ ప్రభుత్వం 50మంది ట్రాన్స్ జెండర్ లను పైలెట్ ప్రాజెక్ట్ కింద ట్రాఫిక్ అసిస్టెంట్స్ నియమించినట్లు తెలిపారు. ఆ సమయంలో బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, పద్మారావు గౌడ్ లు హేళనగా నవ్వడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు.
Also Read :- రెస్టారెంట్లకు దిల్లీ హైకోర్టు షాక్.. సర్వీస్ ఛార్జీలపై కీలక ఆదేశాలు
సమాజంలో తమకు గుర్తింపు లేక, ఉపాధి అవకాశాలు దొరకని పరిస్థితుల్లో ప్రభుత్వం తమకు మనుషులుగా గుర్తించి ఉపాధి కల్పించారని ఈ సందర్భంగా అన్నారు. అదే గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తమను పట్టించుకున్న పాపాన పోలేదని.. ఇప్పుడు తాము గౌరవప్రదమైన పని చేస్తుంటే అవహేళన పరిచేలా వ్యవహరించడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమకు క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.