తులా రాశిలోకి బుధుడు : ఏయే రాశుల వారికి మంచి జరుగుతుంది.. ఎవరికి బాగోలేదు

తులా రాశిలోకి బుధుడు : ఏయే రాశుల వారికి మంచి జరుగుతుంది.. ఎవరికి బాగోలేదు

ఆస్ట్రాలజీ ప్రకారం నవగ్రహాల కదలికలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని జ్యోతిష్యనిపుణులు అంటున్నారు. బుధుడు నవగ్రహాలకు యువరాజుగా ఉంటాడని జ్యోతిష్య గ్రంథాలు చెబుతున్నాయి. బుధుడు తెలివితేటలు, చదువు, వ్యాపారం, సంపాదన ఇతర అంశాలపై ప్రభావం చూపుతాడనేది పండితుల మాట.  తులారాశిలో బుధుడు ప్రవేశంతో దీపావళికి ముందే ఈ రాశులకి మంచి లాభాలు వస్తాయనేది శాస్త్రాలు చెబుతున్నాయి. కొంతమంది ఆర్థిక పరిస్థితిలో మార్పులు, వ్యాపారంలో లాభాలు పొందుతారు. బుధుడు అక్టోబర్ మొదట్లో తన సొంతరాశి కన్యారాశిలోకి రాగా.. అక్టోబర్ 19న శుక్రుడు పాలించే తులారాశిలోకి ప్రవేశించాడు. దీంతో కొన్ని రాశుల వారికి యోగకారుడిగా ఉండి శుభ ఫలితాలు ఇస్తాడని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. తులారాశిలో బుధ గ్రహ సంచారంతో.. జ్యోతిష్య  శాస్త్రం ప్రకారం ఏ రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం. .

మేషరాశి

బుధుడు మేషరాశిలోని 7వ ఇంటిలో సంచారం వలన.. ఈ రాశి వారికి కోరిన కోరికలు నెరవేరుతాయని అంటున్నారు పండితులు. వృత్తి వ్యాపారంలో మంచి పురోగతితో ఆర్థిక ప్రయోజనాలు పొందవచ్చు. జాయింట్ వెంచర్లు చేసే వారికి మంచి లాభాలు వస్తాయి. జీవిత భాగస్వామితో అనుబంధం బాగుంటుంది. ఈ కాలంలో మీ జీవిత భాగస్వామి పురోగతి కూడా చూస్తారు. పెళ్లికాని స్త్రీలకు, అవివాహితులకు మంచి సంబంధాలు దొరికే అవకాశం ఉంది. 

వృషభ రాశి

బుధుడు తులారాశిలో సంచరిస్తున్నప్పుడు వృషభరాశి వారి జీవితం చాలా బాగుంటుందని పండితులు చెబుతున్నారు. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబంపై దృష్టి.. ఆదాయ, వనరులను పెంచుకునేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం.. అనుకూల సమయం అంటున్నారు జ్యోతిష్య పండితులు.

మిధునరాశి

బుధుడు తులారాశిలో సంచరిస్తున్నప్పుడు .. మిధున రాశిలో 5వ ఇంట్లోకి ప్రవేశిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. బుధుడు తులారాశిలోకి మారడంతో.. మిధున రాశి వారికి పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఈ రాశి వారికి వృత్తి పరంగా గౌరవం లభిస్తుంది. వాహనాలు, స్థిరాస్థిని కొనుగోలు చేసే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. 

కర్కాటక రాశి

తులారాశిలో బుధ గ్రహ సంచారంతో.. కర్కాటక రాశి వారు.. కుటుంబసభ్యులతో కలిసి విహార యాత్ర చేసే అవకాశం ఉంది. గతంలో రావలసిన డబ్బు చేతికందుతుంది. కొత్త ఉద్యోగాలకు అవకాశం వచ్చి.. ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి వారు టీం లీడర్ గా మంచి విజయాలు సాధిస్తారు. వృత్తి వ్యాపారంలో అధికంగా లాభాలు గడించే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 

సింహరాశి

బుధుడు తులారాశిలో ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి 8వ ఇంటిలోకి బుధుడు ప్రవేశిస్తాడు. దీని కారణంగా అనుకోకుండా ప్రమోషన్లు రావడం.. ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారం చేసే వారు ఆర్థికంగా నిలదొక్కుకునే అవకాశం ఉంటుంది. కుటుంబ అవసరాలు తీర్చడంలో శ్రద్ద చూపుతారు. కొత్తగా కొన్ని పనులు చేపట్టంతోపాటు.. దాన్ని విజయవంతం చేయగల సామర్థ్యం ఉంటుంది.

కన్యారాశి

బుధుడు తులారాశిలో ప్రవేశించడం వలన కన్యారాశి  వారికి అదృష్టం వరిస్తుందని పండితులు చెబుతున్నారు.  కుటుంబ అవసరాలు తీర్చేందుకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారంలో పురోగతి లభిస్తుంది.  ఉద్యోగులు కంపెనీలు మారే అవకాశం ఉందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.  ప్రభుత్వ రంగం నుంచి ఆర్ధికంగా లాభాలు పొందే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. 

తులారాశి

తులారాశిలోకి బుధుడు రావడంతో ఈ రాశివారికి జీవిత భాగస్వామ్యం నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ కాలంలో తులారాశి వారు పెట్టిన పెట్టుబడులు అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి. వ్యాపారస్థులు, ఉద్యోగస్తులు మంచి లాభాలను పొంది.. సంపద పెరిగేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని అప్పులు చేయవలసి రావచ్చు. ఇంటి నిర్మాణం చేయాలనుకునే వారికి ఇది మంచి సమయమని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. 

వృశ్చికరాశి

తులారాశిలోకి బుధుడు రావడం వలన.. వృశ్చిక రాశిలో నాల్గవ ఇంటిలోకి బుధుడు ఉంటాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. దీంతో వృశ్చిక రాశి వారు విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన సమయం. ఈ విదేశీ టూర్ .. వృశ్చిక రాశి వారి ఆశయాలను నెరవేర్చడంలో కూడా విజయవంతమవుతుందని పండితులు అంటున్నారు. ఈ కాలంలో వృశ్చిక రాశి వారి లీడర్ షిప్.. నాయకత్వ లక్షణాలను ప్రదర్శించి సమాజంలో గుర్తింపు వచ్చే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. 

ధనుస్సురాశి

తులారాశిలోకి బుధుడు రావడం వలన..  బుధుడు ధనుస్సు రాశిలోని 11వ ఇంటికి వెళతాడు. దీని వల్ల అక్టోబర్ 19 నుంచి వీరి ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారు కొత్త ఆదాయ మార్గాల ద్వారా చాలా డబ్బు సంపాదించగలరు. వృత్తిపరంగా నిరుద్యోగులకు ఈ కాలంలో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు కూడా కొత్త ప్రయోజనాలను పొందుతారు. స్టాక్ మార్కెట్, లాటరీ మొదలైన వాటిలో పెట్టుబడి పెడితే మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

మకర రాశి

తులారాశిలో బుధుడు ప్రవేశంతో .. మకరరాశి వారికి  కొన్ని అనుకోని ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.  కార్యాలయంలో సహోద్యోగుల పట్ల బేధాబిప్రాయాలు కలిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు.  ఆర్థిక విషయాల్లో ఎలాంటి మార్పులు లేకపోయినా...అనుకున్న సమయానికి పాత బకాయిలు రావడంతో అనుకున్న పనులు నెరవేరతాయని పండితులు అంటున్నారు. 

కుంభరాశి

తులారాశిలోకి బుధుడు రావడంతో  కుంభరాశి వారు నూతనంగా ఆస్థిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొన్ని కుటుంబ బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. కార్యాలయంలో అదనపు గంటలు పని చేయాల్సి రావచ్చు.. ముందుగా ప్రిపేర్ అయి ఉండాలని పండితులు సూచిస్తున్నారు. తెలియని విషయాల్లో పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిదని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.  గతంలో కంటే ఆరోగ్యం మెరుగు పడే అవకాశాలు ఉన్నాయి.

మీనరాశి

తులారాశిలోకి బుధుడు రావడంతో.. మీన రాశి వారికి పరిస్థితులు సవాలుతో కూడుకుని ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. వ్యక్తిగత జీవితంలో.. వృత్తి, వ్యాపార పరంగా కొన్ని ఒడిదుడుకులుంటయాయని పండితులు అంటున్నారు.  కార్యాలయంలో, ఇంట్లో అపార్థాలకు, గొడవలకు దూరంగా ఉండాలని పండితులు సూచిస్తున్నారు. ఆరోగ్య పరంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందని పండితులు సూచిస్తున్నారు.