
జ్యోతిష్య శాస్త్రంలో, ప్రేమ , భౌతిక ఆనందాలకు శుక్రుడు బాధ్యత వహిస్తాడు. శుక్రుడు ప్రయోజనకరమైన గ్రహంగా పరిగణించబడుతున్నప్పటికీ, శుక్రుడు రాశిచక్రంలో సంచరించినప్పుడు, జాతకం బలహీనంగా ఉన్న వారిపై ప్రభావం భిన్నంగా ఉంటుంది. శుక్రుడు తన రాశిని మార్చి ఆగష్టు 7న కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఆగస్టు 31 వరకు ఈ రాశిలో ఉంటాడు. కర్కాటక రాశిలో శుక్రుని సంచారం కారణంగాకొన్ని రాశుల ఆర్థిక, ప్రేమ జీవితం ప్రభావితమవుతుంది. ఏ రాశి వారికి ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. . .
మేషరాశి
కర్కాటక రాశిలో శుక్రుడు ప్రవేశించడం వల్ల మేషరాశి వారి జీవితాలలో ఇబ్బందులు తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మేషరాశి వారు జీవితంలో అన్ని విలాసాలను పొందడానికి ఇది సరైన సమయని పంచాగాల్లో పేర్కొన్నారు. వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉండి... వ్యాపారం లో అనుకోని విధంగా లాభాలు వస్తాయని పండితులు అంటున్నారు. అయితే మేషరాశి జాతకులు తల్లి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు . ప్రేమ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతున్నారు.
వృషభం
ఈ రాశి వారికి కర్కాటక రాశిలో శుక్ర సంచారం వలన అంతా శుభమే కలుగుతుందని పంచాగకర్తలు చెబుతున్నరు. తోబుట్టువుల మధ్య ఏమైనా సమస్యలు ఉంటే తొలగిపోతాయని జ్యోతిష్కులు అంటున్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులతో సత్సంబంధాలు మెండుగా ఉంటాయని పేర్కొన్నారు. కొత్త ఉద్యోగాలు పొందేందుకు మంచి సమయమంటూ ...దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
మిధునరాశి
కర్కాటక రాశిలో శుక్రుని సంచారం వల్ల ఏర్పడిన గజలక్ష్మి రాజయోగం మిథునరాశి వారికి చాలా సంపదను ఇస్తుందని జ్యోతిష్కులు చెబుతున్నారు. ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారట. వ్యాపారంలో పురోగతితో పాటు .. కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలున్నాయి. అయితే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరమని సూచిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి... మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారని పండితులు చెబుతున్నారు.
కర్కాటక రాశి
ఈ రాశిలోనే సూర్యుడు .. -శుక్రుడు ఒకేసారి సంచరించడంతో అదృష్టం మామూలుగా లేదని పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగి.. . విహారయాత్రలకు వెళ్లే అవకాశం ఉంటుందట. ఉన్నతాధికారుల నుంచి మంచి పేరు సంపాదించుకుంటారని చెబుతున్నారు. మీ పనికి తగిన గుర్తింపు లభించి.. . ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుందని అంటున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది.
సింహ రాశి
కర్కాటక రాశిలో శుక్రుని సంచార ప్రభావంతో విదేశాలకు వెళ్లేందుకు మంచి అవకాశాలున్నాయి ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉందని పండితులు అంటున్నారు.అయితే ప్రయాణ సమయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మీ దాంపత్య జీవితంలో స్వల్ప విభేదాలు వచ్చే అవకాశం ఉందని వారు అంటున్నారు.
కన్య
కన్యా రాశి వారు కర్కాటక రాశిలో శుక్రుని సంచారం వల్ల సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుందని పండితులు చెబుతున్నారు. . ఈ సమయంలో డబ్బు విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోవద్దని జ్యోతిష్కులు సూచిస్తున్నారు. అయినా కాని ఆర్థిక పురోగతి ఉన్నా ..ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుందని పండితులు చెబుతున్నారు. ప్రస్తుతానికి పెట్టుబడికి దూరంగా ఉండమని సలహా ఇస్తున్నారు. . ఈ సమయంలోఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించమని చెబుతున్నారు.
తులారాశి
శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినందున, తులారాశి వారికి కుటుంబ జీవితం కొంత కష్టంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ సమయంలో మీ పెద్దల సలహాను నిర్లక్ష్యం చేయవద్దంటున్నారు. ఈ కాలంలో మీరు ఉద్యోగంలో ఇబ్బందులను ఎదుర్కోవలసి రావచ్చని సూచిస్తున్నారు. మీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
వృశ్చిక రాశి
శుక్ర సంచార ప్రభావం ఈ రాశివారికి భాగ్య స్థానంలో శుక్రుడు ప్రవేశించడం వల్ల స్త్రీలతో స్నేహ సంబంధాలు బాగా పెరిగే సూచనలున్నాయని పండితులు చెబుతున్నారు. కోరికలు కొత్త పుంతలు తొక్కడం వల్ల వీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లే సూచనలు కూడా ఉన్నాయని వారు అంటున్నారు. కొంతమంది కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి .. ఆర్థిక పరిస్థితిని మెరుగుపడే అవకాశాన్ని పొందుతారంటున్నారు పండితులు.
ధనుస్సు రాశి
శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినందున ధనుస్సు రాశికి ఈ కాలంలో గట్టి పోటీని ఎదుర్కోవలసి ఉంటుందని చెబుతున్నారు. మీరు ఎవరి దగ్గరా అప్పు తీసుకోవద్దని సూచిస్తున్నారు. ఈ సమయంలో ప్రతి లావాదేవీ చాలా జాగ్రత్తగా చేయాలంటున్నారు. ఈ సమయంలో విద్యార్థులకు ఆటంకాలు ఎదురవుతాయి. కార్యాలయంలో జూనియర్‌లతో మంచిగా వ్యవహరించంని సలహా ఇస్తు్న్నారు.
మకరరాశి
కర్కాటక రాశిలో శుక్రుని సంచారం కారణంగా మంచి ఫలితాలొచ్చే అవకాశం ఉందని పండితులు అంటున్నారు. ఈ కాలంలో మీరు శత్రువులను ఓడించి వారి వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారంటున్నారు. మీరు మానసిక ప్రశాంతత, ఆనందాన్ని కూడా అనుభవిస్తారని జ్యోతిష్కులు అంటున్నారు. ఈ కాలంలో మీరు చేసే పనులన్నింటిలో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి మాట విన్న తర్వాతే నిర్ణయం తీసుకోమని పండితులు సలహా ఇస్తున్నారు.
కుంభ రాశి
శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినందున కుంభ రాశివారు విజయం సాధించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. ఖర్చులు పెరిగడంతో ఇబ్బంది పడే అవకాశం ఉందని అంటున్నారు పండితులు. మీ మరియు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సూచిస్తున్నారు.
మీనరాశి
శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినందున మీనరాశి జాతకుల ప్రేమ సంబంధాలను ప్రభావితం చేస్తుందని పండితులు చెబుతున్నారు. మీ భాగస్వామి పట్ల మీ నిజాయితీని పరీక్షించడానికి చాలా కష్టమైన సవాళ్లతో కూడిన సమయం ఎదురవుతుదంటున్నారు.. దాంపత్య జీవితంలో గొడవలు వచ్చి . కొంతమంది బాధాకరమైన బ్రేకప్ కూడా ఎదురయ్యే అవకాశం ఉందని పండితులు అంటున్నారు.