టార్గెట్ 30 లక్షల మొక్కలు..వన మహోత్సవంలో మంత్రి పొన్నం

టార్గెట్ 30 లక్షల మొక్కలు..వన మహోత్సవంలో మంత్రి పొన్నం
  • అట్టహాసంగా కార్యక్రమం

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్  పరిధిలో 30 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఇవాళ ఇవాళ జీహెచ్‌ఎంసీలోని 56 ప్రాంతాల్లో మన మహోత్సవం పేరిట 7,134 మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

రామంతపూర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల మైదానంలో మొక్కనాటిన మంత్రి పొన్నం కార్యక్రమంలో పాల్గొన్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి, మేయర్‌ విజయలక్ష్మితో కలిసి మొక్క నాటారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఫారెస్ట్‌ ఆఫ్‌ సర్వే ఇండియా ప్రకారం 10 ఏళ్లలో 147 శాతం పెరిగిన అటవీ విస్తీర్ణం పెరిగిందని చెప్పారు. 33.15 చదరపు కిలోమీటర్ల నుంచి 81.81 చదరపు కిలోమీటర్ల పొడవునకు పచ్చదనం పెరిగిందని చెప్పారు. 

క్కలు నాటడం అంటే భవిష్యత్తు తరాలకు సహకారం అందించడమేనని అన్నారు. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారం అవసరమని చెప్పారు. మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ బాధ్యతను కూడా ప్రజలు తీసుకోవాలని చెప్పారు. కాలుష్యం పెరిగితే వచ్చే తరం మనల్ని క్షమించదన్నారు. ప్రజలందరూ వారి వారి కుటుంబ సభ్యులు బంధువుల పేరుతో మంచి కార్యక్రమంలో మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు.  

తరూ చిత్తశుద్ధితో  వనమహోత్సవంలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. హైదరాబాద్ నగరాన్ని గ్రీన్  సిటీగా మార్చాలని లక్ష్యంగా  పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు.