మున్నేరువాగును పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్

మున్నేరువాగును పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్

రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఖమ్మం జిల్లాలో వాగులు పొంగిపొర్లుతున్నాయి. జిల్లాలోని మున్నేరు వాగు కూడా వరదనీటితో నిండిపోయింది. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో మున్నేరు వాగు ప్రవహిస్తున్న కాల్వ ఒడ్డు పరివాహక ప్రాంత వాసులకు నయాబజార్ పాఠశాల, ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో షెల్టర్ హోమ్ ఏర్పాటు చేశారు. ఆ పునరావాస కేంద్రాలను మంత్రి పువ్వాడ అజయ్ సందర్శించారు. అక్కడున్న వారికి తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాగు పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేయాలని అధికారులకు సూచించారు. ముంపు ప్రాంత నిర్వాసితులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అనంతరం మున్నేరు ఉధృతిని పరిశీలించారు. మున్నేరు ప్రవహాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసేలా నోట్ తయారు చేయాలని మున్సిపల్ కమిషనర్ అనురాగ్ జయంతికి సూచించారు. ఖమ్మం జిల్లాలో చెరువులు, కాలువలు పొంగి ప్రహిస్తున్న నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కి సూచించారు.

For More News..

చెరుకుతోటలో 13 ఏళ్ల బాలికపై రేప్

రిటైర్ మెంట్ పై ధోని భార్య హార్ట్ ఫెల్ట్ పోస్ట్

భారీ వర్షాలకు నీటమునిగిన లక్నవరం కేబుల్ బ్రిడ్జ్