లోన్ యాప్ బాధితులు రోజురోజుకు పెరిగిపోతున్నారు. ఇన్స్టెంట్ మని కోసం చూసే వారినే టార్గెట్ చేస్తున్న లోన్ యాప్ సంస్థలు బాధితుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి.తాజాగా, గుంటూరులో మరో యువకుడు లోన్ యాప్ వేధింపులకు గురైన సంఘటన వెలుగులోకి వచ్చింది. గుంటూరుకు చెందిన 31 ఏళ్ళ ఆటో డ్రైవర్ లోన్ యాప్ ద్వారా డబ్బులు తీసుకున్నాడు.లోన్ తీసుకున్న డబ్బులు తిరిగి చెల్లించినప్పటికీ ఇంకా డబ్బులు చెల్లించాలంటూ లోన్ యాప్ నుండి వేధింపులు మొదలయ్యాయి.
అదే సమయంలో కిడ్నీ దానం చేస్తే 30లక్షలు ఇస్తామంటూ పేస్ బుక్ లో యాడ్ చూసాడు సదరు ఆటో డ్రైవర్. ఆ యాడ్ లో ఉన్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించగా, విజయవాడలోని విజయ హాస్పిటల్ కి తీసుకెళ్లి, ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి సర్జరీ చేయించి కిడ్నీ తీసుకున్నారు దుండగులు.ఆ తర్వాత ఏజెంట్స్ డబ్బులు ఇవ్వకుండా మోసం చేశారు. 30లక్షలు ఇస్తామన్న ఏజెంట్లు 7నెలలకు గాను 50వేలు మాత్రమే ఇచ్చారని బాధితుడు వాపోతున్నాడు.