క్రీడలు ఆత్మస్థైర్యాన్ని నింపుతాయి : ట్రస్మా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ 

చండూరు, వెలుగు : క్రీడలు ఆత్మస్థైర్యాన్ని నింపుతాయని, దీంతో విద్యార్థుల్లో స్నేహాభావం పెరుగుతుందని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు, గాంధీజీ విద్యాసంస్థల చైర్మన్ కోడి శ్రీనివాసులు అన్నారు. ఆదివారం చండూరులోని గాంధీజీ హైస్కూల్​లో డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి క్రీడోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. కుల, మత బేధాలు లేకుండా ప్రతిఒక్కరూ స్నేహాభావంతో మెలగాలని సూచించారు. విద్యార్థులలో ఉన్న నైపుణ్యాన్ని వెలికితీయడానికి డీవైఎఫ్ఐ కృషి చేస్తుందని కొనియాడారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. డైరెక్టర్ సరికొండ వెంకన్న, డీవైఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు.