
ఖమ్మం జిల్లా ఏన్కూర్ లో ఓ వాహనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఖమ్మం నుంచి కొత్తగూడెం నుంచి వెళ్తున్న వాహనం జన్నారం క్రాస్ రోడ్ సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఎలక్ట్రానిక్ వస్తువులు రవాణా చేయుచుండగా ఈ ప్రమాదం జరిగింది.
టాటా ఏసీ వాహనంలో ఉన్న 6 ఏసీలు. 6ఫ్రిజ్ లు దగ్ధమవయ్యాయి, అయితే ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 10 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువుల అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ ప్రమాదానికి సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.