Education: ఉన్నత విద్య కోసం US కు వెళ్తున్నారా?.. ఈ ధృవపత్రాలు సిద్ధం చేసుకోండి

Education: ఉన్నత విద్య కోసం US కు వెళ్తున్నారా?.. ఈ ధృవపత్రాలు సిద్ధం చేసుకోండి

చాలా  మంది విద్యార్థులు విదేశాల్లో చదవాలని కలలు కంటుంటారు. కొందరికి అలా అవకాశం కూడా వస్తుంది. ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లే వారు తప్పక ఈ ఆర్టికల్ తప్పక చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. ఉన్నత విద్య కోసం ఎబ్రాడ్ వెళ్లే వారు జాగ్రత్తగా ప్రణాళిక చేసుకోవాలి . విద్యార్థి వీసా, కావాల్సిన సర్టిఫికెట్లు, ఖర్చులు ఇలాంటి విషయాల్లో ఖచ్చితమైన పరిజ్ణానం ఉందటి. అడ్మిషన్లకు అవసరైన సర్టిఫికెట్ల విషయానికొస్తే ప్రతి దేశం దాని స్వంతం నియమాలు, నిబంషధ నలను కలిగి ఉంటుంది. అమెరికాలో ఉన్న ప్రతిష్టాత్మక కళాశాల్లలో ప్రవేశం పొందాలనుకునే వారికి అవసరమైన పత్రాల జాబితా మీకోసం అందిస్తు్న్నాం.  యూఎస్ వెళ్లానుకునేవారు ఈ పత్రాలను తప్పకుండా సిద్దం చేసుకోండి. 

పాస్ పోర్ట్: మీ ఫ్లైట్ కూడా ఎక్కలేని అత్యంత కీలకమైన పత్రాల్లో ఒకటి మీ పాస్ పోర్టు. మీరు విమానం ఎక్కడానికి , యూఎస్ కస్టమ్స్ గుండా వెళ్లడానికి ఇది చాలా అవసరం. విదేశాలకు వెళ్లేటప్పుడు  మీ గుర్తింపు, వయస్సేుకు రుజువుగా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా పాస్ పోర్టు మీ దగ్గర ఉంచుకోవాలి. 
ఫ్లైట్ డాక్యుమెంట్లు: విమాన ప్రయాణ వ్యవధి ఎక్కువగా ఉన్నందున మొబైల్ ఫోన్ పై ఆధారపడటం ప్రమాదకరం. ఎయిర్ టికెట్లతో సహా అవసరమైన అన్ని విమాన పత్రాలు మీ వద్ద ఉన్నాయని నిర్ధారించుకోవడం తప్పనిసరి . 

స్టూడెంట్ వీసా: పాస్ పోర్ట్ ఇతర విమాన పత్రాలు కాకుండా విదేశాల్లో ఉండి చదువుకోవడానికి స్టూడెంట్ వీసీ తప్పనిసరి. 

అడ్మిషన్ లెటర్: ఎంట్రీ పాయింట్ వద్ద మీ గమ్యాన్ని నిరూపించమని మిమ్మల్లి అడుగుతారు. మీరు ఏప్రాంతంలో  ఏ కాలేజీలో లేదా ఏ యూనివర్సిటీలో చదువుతున్నారు అనే తెలిపేందుకు అడ్మిషన్ లెటర్ తప్పనిసరి ఎంట్రీ పాయింట్ వద్ద చూపించాల్సి ఉంటుంది. 

ఫారమ్ 1-20: ఈ ఫారమ్ ను కొత్త దేశంలోకి ప్రవేశించే సమయంలో కస్టమ్స్ అధికారులకు చూపించాల్సి ఉంటుంది. ఈ ఫారమ్ జీరాక్స్ కాపీ, ఒరిజినల్ కాపీనీ మీ పాస్ పోర్టుతో సహా ఉంచుకోవాలి. ఎందుకంటే ఇది మీ యూఎస్ ప్రయాణంలో మీకు అవసరమైన అత్యంత ముఖ్యమైన పత్రాలలో ఒకటి. 

పైన ఇవ్వబడిన పత్రాలలోపాటు విదేశాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులు లైఫ్ ఇన్సూరెన్స్ పత్రాలు, మెడికల్ రికార్డులు, అకడమిక్ సర్టిఫికెట్లు, మీరు క్రమం తప్పకుండా తీసుకునే మెడిసిన్ ఏవైనా ఉంటే.. ప్రిస్కిస్షన్లు మీ వెంట ఉంచుకోవాలి. 

సో..యూఎస్ వెళ్లాలనుకునే విద్యార్థులు పైన తెలిపిన పత్రాలను మీ వెంటనే ఉంచుకుంటే ఎలాంటి ఇబ్బందిలేని సేఫ్ జెర్నీ చేయొచ్చు.